Jagapathi Babu : కోవిడ్‌కి థ్యాంక్స్ అంటున్న జగ్గూ భాయ్.. బీచ్‌లో రకుల్‌తో ఉపాసన..
ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి స్టైలిష్ విలన్ జగపతి బాబు కోవిడ్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు. కరోనా కారంణంగా షూటింగ్ స్పాట్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ కూడా తప్పనిసరి కావడంతో మేకప్ చెయ్యడానికి ఎవరూ లేకపోవడంతో తానే మేకప్ మెన్‌గా మారి ముఖానికి మేకప్ వేసుకున్నారు..
- sekhar
- Published On : April 18, 2021 / 04:41 PM IST
Jagapathi Babu
Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి స్టైలిష్ విలన్ జగపతి బాబు కోవిడ్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు. కరోనా కారంణంగా షూటింగ్ స్పాట్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ కూడా తప్పనిసరి కావడంతో మేకప్ చెయ్యడానికి ఎవరూ లేకపోవడంతో తానే మేకప్ మెన్‌గా మారి ముఖానికి మేకప్ వేసుకున్నారు.
‘థ్యాంక్యూ కోవిడ్.. నేను నా సొంత మేకప్ మెన్‌ని అయ్యాను’ అంటూ మేకప్ వేసుకుంటున్న ఫొటను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు జగ్గుభాయ్. సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న జగపతిబాబు ఇటీవల ‘FCUK – ఫాదర్ చిట్టి ఉమ కార్తీక్’ మూవీలో ఏజ్డ్ ప్లేబాయ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు.
Thanks to covid..I have become my own make up man. Ha haa.#StayHomeStaySafe pic.twitter.com/oeOBGEkrWd
— Jaggu Bhai (@IamJagguBhai) April 18, 2021
మెగా కోడలు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, హీరోయిన్ రకుల్ ప్రీత్‌తో కలిసి బీచ్‌లో సరదాగా తీసుకున్న పిక్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక, భావోద్వేగాల సమతుల్యత వంటి ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయాలనే సదుద్దేశంతో “URLife.co.in’’ అనే వెబ్‌సైట్‌ను లాంచ్ చేసి సెలబ్రిటీలతో ఇంటర్వూలు చేస్తుంటారు ఉపాసన. అందులో భాగంగా ఫిట్ నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్‌తో ముచ్చటిస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారామె.
