×
Ad

Kangana Ranaut : సుశాంత్‌లానే కార్తీక్‌ని కూడా తొక్కేస్తున్నారంటూ కరణ్ జోహార్‌పై మండిపడుతున్న కంగనా..

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ మీద మండిపడుతోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. కరణ్ జోహార్‌ని విమర్శించే ఏ ఛాన్స్‌నూ వదులుకోని ఈ స్టార్ హీరోయిన్ లేటెస్ట్‌గా కరణ్ మీద ఫుల్ ఫైర్ అవుతోంది. అంతే కాదు సోషల్ మీడియాలో కరణ్ అండ్ బ్యాచ్‌ని తిడుతూ పోస్టులు పెడుతోంది. ఇంతకీ కంగనా కోపానికి కారణమేంటి..?

  • Published On : April 17, 2021 / 06:40 PM IST

Kangana Ranaut Controversial Comments On Karan Johar Over Kartik Aryans Ouster From Dostana 2

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ మీద మండిపడుతోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. కరణ్ జోహార్‌ని విమర్శించే ఏ ఛాన్స్‌నూ వదులుకోని ఈ స్టార్ హీరోయిన్ లేటెస్ట్‌గా కరణ్ మీద ఫుల్ ఫైర్ అవుతోంది. అంతే కాదు సోషల్ మీడియాలో కరణ్ అండ్ బ్యాచ్‌ని తిడుతూ పోస్టులు పెడుతోంది. ఇంతకీ కంగనా కోపానికి కారణమేంటి..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా కరణ్ జోహార్ మీద ఫుల్ ఫైర్ మీదున్నారు. నెపొటిజంతో టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ, స్టార్ కిడ్స్‌నే ఎంకరేజ్ చేస్తున్నారంటూ కరణ్ జోహార్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. ఎందుకంటే కరణ్ లేటెస్ట్‌గా తన ప్రొడక్షన్‌లో రెడీ అవుతున్న ‘దోస్తానా 2’ నుంచి కార్తీక్ ఆర్యన్‌ను తీసేస్తున్నట్టు అనౌన్స్ చేశారు .

అప్‌కమింగ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్ ఇప్పుడిప్పుడే కెరీర్‌‌లో బిజీ అవుతున్నాడు. పెద్దగా బ్యాగ్రౌండ్ లేని కార్తీక్ బాలీవుడ్‌లో తనకంటూ సొంతగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. అయితే లాక్‌డౌన్‌కి ముందే సూపర్ హిట్ మూవీ ‘దోస్తానా’ కి సీక్వెల్‌గా ‘దోస్తానా 2’ ని కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. పాండమిక్ తర్వాత ఈ సినిమాకు సంబందించి కొంతపార్ట్ షూటింగ్ కూడా జరిగింది.

‘దోస్తానా 2’ షూటింగ్ జరుగుతుండగానే కరణ్ జోహార్ తన సినిమా నుంచి కార్తీక్‌ని తప్పించడంతో పాటు అతను అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ వల్ల ఫ్యూచర్‌లో కూడా కార్తీక్‌తో సినిమాలు చెయ్యకూడదని డిసైడ్ అయ్యినట్టు ధర్మ ప్రొడక్షన్ సంస్థ తరపునుండి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో కంగనా కరణ్ మీద ఫుల్ ఫైర్ అవుతోంది. సుశాంత్ సింగ్ మీద చేసినట్టే.. కార్తీక్ మీద కూడా అన్ ప్రొఫెషనల్ అని, డ్రగ్స్ అని రకరకాల కారణాలు చూపించి సినిమా నుంచి తీసేశారని, మీ స్టార్ కిడ్స్ బ్యాచ్‌ని మాత్రమే ప్రమోట్ చేస్తూ.. టాలెంట్ ఉన్న అవుట్ సైడర్స్‌ని తొక్కేస్తున్నారని సోషల్ మీడియాలో ఫైర్ అవుతోంది కంగనా..