SPB Bharat Ratna: గాన గంధర్వులు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఐదు దశాబ్దాలకు పైగా తన పాటతో ఆబాల గోపాలాన్ని అలరించిన మహాగాయకుడిని ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించాలని సంగీతాభిమానులు, బాలు అభిమానులు కోరుకుంటున్నారు. ప్రముఖ రచయిత, నటులు, దర్శకులు తనికెళ్ళ భరణి బాలుకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని 10 టీవీతో అన్నారు.
బాలు భారతదేశం యొక్క జాతి రత్నం.. ఆయనకు భారతరత్న ఇవ్వడం మనల్ని మనం గౌరవించుకోవడమే.. అన్నారు సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసాద్..
ఆయన మాట్లాడుతూ.. ‘‘లతా మంగేష్కర్‌లా బతికి ఉన్నప్పుడే బాలు గారికి భారతరత్న ఇచ్చి ఉంటే బాగుండేది. పద్మభూషణ్‌తో సహా సౌత్‌లో ఉన్న అన్నీ అవార్డులన్నీ ఆయన అందుకున్నారు. ఇంతకుముందు వచ్చిన అవార్డులన్నీ ఒక ఎత్తు.. అత్యున్నత పురస్కారం భారతరత్న మరో ఎత్తు.
14 భాషల్లో పాటలు పాడిన బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాను.. ఈ విషయంలో ప్రధానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికి నా కృతజ్ఙతలు’’.. అని చెప్పారు కాట్రగడ్డ ప్రసాద్.