Tamil Nadu CM Relief fund : ముఖ్యమంత్రి సహాయనిధికి కోలీవుడ్ సెలబ్రిటీల విరాళం..

తాజాగా మరికొంతమంది ప్రముఖులు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందచేశారు. దర్శకుడు ఏ.ఆర్. మురగ దాస్, డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఆయన ఆఫీసులో కలిసి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు..

Tamil Nadu Cm Relief Fund

Tamil Nadu CM Relief fund: కోవిడ్ సెకండ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.. ఆక్సిజన్, మందులు, బెడ్‌ల కొరతతో కరోనా బాధితులు నరకం చూస్తున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం అందిస్తున్నారు. ఇటీవల సీనియర్ తమిళ్ నటుడు శివ కుమార్, తన ఇద్దరు కొడుకులు అయిన తమిళ స్టార్స్ సూర్య, కార్తి, సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ డెరెక్టర్ రాజశేఖర్ పాండియన్‌లతో కలిసి కోవిడ్ నివారణకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయళ విరాళమందించారు.

తాజాగా మరికొంతమంది ప్రముఖులు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందచేశారు. దర్శకుడు ఏ.ఆర్. మురగ దాస్, డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఆయన ఆఫీసులో కలిసి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు.. తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ 25 లక్షల రూపాయలను బ్యాంక్ అకౌంట్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు..

సూపర్‌స్టార్ రజినీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజినీకాంత్ కోటి రూపాయల విరాళమిచ్చారు.. భర్త విశాగన్, మామ, ఆడపడుచులతో కలిసి సీఎంకు చెక్కు అందంజేశారు. కరోనా బాధితులకు అండగా నిలబడడం కోసం మంచి మనసుతో ముందుకొచ్చిన కోలీవుడ్ సెలబ్రిటీలను స్టాలిన్ అభినందించారు..