బుల్లితెర నటి ఆత్మహత్య.. ముఖంపై గాయాలు ఎలా అయ్యాయి?

  • Publish Date - December 10, 2020 / 12:28 PM IST

Kollywood TV Actress VJ Chithra: పాపులర్ తమిళ్ టీవీ నటి V. J. Chitra ఆత్మహత్యతో కోలీవుడ్ టెలివిజన్ పరిశ్రమ షాక్‌కి గురైంది. బుధవారం (డిసెంబర్ 9) తెల్లవారు జామున షూటింగునుండి హోటల్ రూంకి వచ్చిన చిత్ర.. స్నానం చేయడానికని వెళ్లి చీరతో ఉరి వేసుకున్నారు. ఆ సమయంలో భర్త హేమంత్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు.


చిత్ర ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి, హోటల్ సిబ్బందికి సమాచారమివ్వగా, స్పేర్ కీ తో తలుపులు తెరిచారు. అప్పటికే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే చిత్ర తల్లిదండ్రులు తమ కూతురు సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని, ఆమె ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.

దీంతో పోలీసులు చిత్ర భర్త హేమంత్ కుమార్‌తో పాటు హోటల్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిత్ర ముఖంపై రెండు చోట్ల గాయాలుండడంతో చిత్ర, హేమంత్ మధ్య ఏవైనా గొడవలున్నాయా, హత్యా, ఆత్మహత్యా అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.. అలాగే హోటల్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటుజ్‌ను పరిశీలిస్తున్నారు.


రెండు నెలలక్రితం చిత్ర, హేమంత్‌ల నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్ 19న వీరిద్దరు రహస్యంగా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వచ్చే జనవరిలో అందరి సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇంతలో చిత్ర ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కలచివేసంది.