Lavanya Tripathi Interview About Chaavu Kaburu Challaga
Lavanya Tripathi: కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చావు కబురు చల్లగా’.. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు. ఈ నెల 19న మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు..
‘ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. గీతా ఆర్ట్స్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు బన్నీ వాసు గారు. ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు. గీతా ఆర్ట్స్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది పక్కన పెడితే కథ ప్రకారం ఈ సినిమా నాకు నచ్చింది. దానికి కౌశిక్, వాసు, అరవింద్ గారికి థ్యాంక్స్. కౌశిక్ ఈ కథ చెప్పినపుడు సగంలోనే ఓకే చెప్పాను. ఇలాంటి కథ చెప్పినందుకు థ్యాంక్స్. కార్తికేయ మంచి కో ఆర్టిస్ట్. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్.
కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వాసు గారికి, అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా నా సొంత వాయిస్‌తో డబ్బింగ్ చెబుతాను. కౌశిక్ ఎంత ఇంటెక్షన్‌తో కథ రాసాడో అంతే ఇంటెక్షన్‌తో కార్తికేయ ఈ సినిమాలో నటించాడు. ఒక మంచి సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సరికొత్త స్క్రీన్‌ప్లే అందరినీ అలరిస్తుంది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. తెలుగులో ఒక థ్రిల్లర్ సినిమా సైన్ చేశాను, తమిళ్‌లో ఒక సినిమా చేస్తున్నాను, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను’.. అన్నారు.