Love Is Blind And Love Doesnt Discriminate Brand New Poster Of Maestro Movie
Maestro: యూత్ స్టార్ నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ.. ‘మాస్ట్రో’. నితిన్ నటిస్తున్న 30వ చిత్రం ఇది.. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీరామ నవమి శుభాకాంక్షలతో ‘మాస్ట్రో’ బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
నభా నటేష్ స్కూటీ నడుపుతూ ఉండగా.. నితిన్ ఆమె వెనక కూర్చుని కలర్ ఫుల్‌గా ఉన్న ఈ రొమాంటిక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తోన్న ‘మాస్ట్రో’ 2021లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. ఇటీవల ‘రంగ్ దే’ సినిమాతో విజయం సాధించారు హీరో నితిన్.
‘భీష్మ’ మూవీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికీ సుమధుర బాణీలను సమకూరుస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.
తారాగణం:
నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, నరేష్, జిషుసేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాస్ రెడ్డి.
సాంకేతిక బృందం:
మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్
సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల
మ్యూజిక్: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్
ఆర్ట్: సాహి సురేష్..