Mahesh Babu : సెల్ఫ్ ఐసోలేషన్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు.. అతని కారణంగానే..

కరోనా సెకండ్ వేవ్ ప్రజల్ని గజగజ వణికిస్తోంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ మహమ్మారి విజృంభిస్తోంది.. సామాన్యులు, సెలబ్రిటీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. షూటింగ్స్ నిలిచిపోయాయి.. థియేటర్లు మూతపడ్డాయి.. సినిమా వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది..

Mahesh Babu

Mahesh Babu: కరోనా సెకండ్ వేవ్ ప్రజల్ని గజగజ వణికిస్తోంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ మహమ్మారి విజృంభిస్తోంది.. సామాన్యులు, సెలబ్రిటీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. షూటింగ్స్ నిలిచిపోయాయి.. థియేటర్లు మూతపడ్డాయి.. సినిమా వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది..

ఇప్పటికే పెద్ద హీరోల సినిమాలు షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చేశారు. ఎవరికి వారు క్వారంటైన్‌లో, హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది..

 

మహేష్ బాబు పర్సనల్ స్టైలిష్‌కు కరోనా సోకింది.. అలాగే యూనిట్‌లో కొందరికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి.. దీంతో తాత్కాలికంగా షూటింగ్ నిలిపివేశారు.. రెబల్ స్టార్ ప్రభాస్‌తో సహా కరోనా పాజిటివ్ వచ్చిన వారితో క్లోజ్‌గా మూవ్ అయిన పలువురు సెలబ్రిటీలు హోమ్ క్యారంటైన్‌లోకి వెళ్లిపోయారు..