Tamilisai
Tamilisai Soundararajan: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే తాము ముందుగా ‘మహిళా దర్బార్’ నిర్వహిస్తున్నామని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గవర్నర్ ఆధ్వర్యంలో నేడు రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ… మహిళలకు అండగా ఉండాలనే ‘మహిళా దర్బార్’ నిర్వహిస్తున్నామని, అంతేగానీ, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెప్పారు. తాము ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు.
prophet row: ఏ నేరం చేశానో పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు: అసదుద్దీన్ ఒవైసీ
అయితే, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలను కలిసి సమస్యలను పరిష్కరించేందుకే ఉన్నాయని తమిళిసై చెప్పారు. రాజ్ భవన్‌ను గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆమె అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ప్రభుత్వానికి పంపుతామమని, వాటిపై స్పందించాలని కోరుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఇటీవల కలకలం రేపిన అత్యాచారం కేసుపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని, కానీ వారు ఇవ్వలేదని ఆమె చెప్పారు.
cordelia: విశాఖ నుంచి వెళ్లిన నౌక కార్డేలియాకు పుదుచ్చేరిలో అనుమతి నిరాకరణ
రాజ్ భవన్‌కి ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉందని ఆమె తెలిపారు. మహిళా దర్బార్‌ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని తమిళిసై చెప్పారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో పని చేస్తున్నానని చెప్పారు. ఈ సేవను కొందరు చేస్తోన్న వ్యాఖ్యలతో ఎందుకు ఆపేయాలని ఆమె ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని చూస్తామని, నిర్లక్ష్యం చేయబోమని చెప్పారు. గవర్నర్ కార్యాలయం నుంచి విజ్ఞప్తులు వస్తే కనీసం స్పందించాలని ప్రభుత్వ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.