cordelia: విశాఖ నుంచి వెళ్లిన నౌక కార్డేలియాకు పుదుచ్చేరిలో అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

సముద్ర విహార నౌక కార్డేలియా రెండు రోజుల క్రిత‌మే విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, విశాఖ-పుదుచ్చేరి-చెన్నై మార్గంలో తొలిసారిగా సేవలు అందిస్తోన్న ఈ విలాస వంతమైన నౌక‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి.

cordelia: విశాఖ నుంచి వెళ్లిన నౌక కార్డేలియాకు పుదుచ్చేరిలో అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

Cordelia

cordelia: సముద్ర విహార నౌక కార్డేలియా రెండు రోజుల క్రిత‌మే విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, విశాఖ-పుదుచ్చేరి-చెన్నై మార్గంలో తొలిసారిగా సేవలు అందిస్తోన్న ఈ విలాస వంతమైన నౌక‌కు ఆదిలోనే ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. కార్డేలియా క్రూయిజ్‌ సంస్థ నడిపే ఈ నౌక హాల్ట్‌కు పుదుచ్చేరి ప‌రిపాల‌నా విభాగం అనుమతి నిరాక‌రించింది. ఈ నౌక‌లో క్యాసినోతో పాటు పుదుచ్చేరికి చెందని మ‌ద్యాన్ని అమ్మే అనుమతి లేనందువల్ల అనుమతి నిరాకరిస్తున్నట్టు తెలిపింది.

prophet row: ఏ నేరం చేశానో పేర్కొన‌కుండా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు: అస‌దుద్దీన్ ఒవైసీ

నేటి ఉదయం 7 గంట‌ల నుంచి యాంకరేజ్‌లో అనుమతి కోసం కార్డేలియా వేచి చూస్తోంది. నౌక‌కు అనుమతి ఇవ్వ‌క‌పోవ‌డంతో మారిటైమ్ బోర్డ్, కేంద్ర ప్రభుత్వంతో జేఎం భక్షి గ్రూప్ మాట్లాడుతోంది. పుదుచ్చేరి అనుమతించకపోతే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని కడులూరు పోర్ట్‌లో నౌక‌ను ఆపేందుకు యోచిస్తోంది. ఈ నౌక ఈ నెల‌ 8వ తేదిన విశాఖలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభమైన విష‌యం తెలిసిందే. అదే రోజు సాయంత్రం విశాఖ నుండి ఈ నౌక‌ పుదుచ్చేరికి బయలు దేరింది.