prophet row: ఏ నేరం చేశానో పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు: అసదుద్దీన్ ఒవైసీ
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారిపై ఆ పార్టీ చర్యలు తీసుకోవడం వంటి ఘటనల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పలువురిపై ఢిల్లీలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదుకాగా అందులో ఒక దాంట్లో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేరు కూడా ఉంది.

Asaduddin Owaisi
prophet row: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారిపై ఆ పార్టీ చర్యలు తీసుకోవడం వంటి ఘటనల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పలువురిపై ఢిల్లీలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదుకాగా అందులో ఒక దాంట్లో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేరు కూడా ఉంది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదంపై సామాజిక మాధ్యమాల్లో అసదుద్దీన్ ఒవైసీ పలు పోస్టులు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో అసదుద్దీన్ మద్దతుదారులు న్యూఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.
Prophet row: నురూప్ శర్మతో పాటు మరో ఏడుగురిపై ఢిల్లీలో కేసులు
దీంతో ముగ్గురు మహిళలు సహా దాదాపు 25 మందిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. కాగా, ఢిల్లీ పోలీసులు అసదుద్దీన్ ఒవైసీ, నురూప్ శర్మ, నవీన్ జిందాల్, షాదాబ్ చౌహాన్, సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనాపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసుపై అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ వేదికగా స్పందించారు. ”నేను ఏ నేరం చేశానో పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఇదే తొలిసారి చూస్తున్నాను. ఈ తీరు ఎలా ఉందంటే.. రక్తపు మడుగులో ఒకరు విగతజీవిగా కనపడితే, అతడిని హత్య చేయడానికి దుండగులు ఏ ఆయుధాన్ని వాడారన్న విషయాన్ని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయనట్లు ఉంది” అని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.