Prophet row: నురూప్ శర్మతో పాటు మ‌రో ఏడుగురిపై ఢిల్లీలో కేసులు

బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన నురూప్ శర్మ, ఆ పార్టీ మాజీ నేత‌ న‌వీన్ జిందాల్‌, జ‌ర్న‌లిస్టు స‌బా న‌ఖ్వీతో పాటు ప‌లువురిపై ఢిల్లీ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శర్మ, న‌వీన్ జిందాల్ చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే.

Prophet row: నురూప్ శర్మతో పాటు మ‌రో ఏడుగురిపై ఢిల్లీలో కేసులు

Nurup Sharma

Prophet row: బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన నురూప్ శర్మ, ఆ పార్టీ మాజీ నేత‌ న‌వీన్ జిందాల్‌, జ‌ర్న‌లిస్టు స‌బా న‌ఖ్వీతో పాటు ప‌లువురిపై ఢిల్లీ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శర్మ, న‌వీన్ జిందాల్ చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే విద్వేష‌పూరిత సందేశాలు ఇస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు.

Prophet remark row: భార‌త్ స్పందించిన‌ తీరుపై ఇరాన్ సంతృప్తి

మొద‌టి ఎఫ్ఐఆర్ నురూప్ శ‌ర్మ‌పై, రెండో ఎఫ్ఐఆర్ న‌వీన్ జిందాల్‌, షాదాబ్ చౌహాన్, సబా న‌ఖ్వీ, మౌలానా ముఫ్తీ న‌దీమ్‌, అబ్దుర్ రెహ్మాన్‌, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనాపై న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. నురూప్ శ‌ర్మ‌పై ఐపీసీ 153(ఉద్దేశ‌పూర్వ‌కంగా రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌డం), 295 (మ‌త విశ్వాసాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం) 505 (ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగేలా వ్యాఖ్య‌లు చేయ‌డం) కింద పోలీసులు కేసులు పెట్టారు. కేసు ఎదుర్కోనున్న వారిలో ప‌లు మ‌తాల‌కు చెందిన వారు ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. కాగా, నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ చేసిన వ్యాఖ్య‌లు ఓ వైపు క‌ల‌క‌లం రేపుతూ యూపీలో హింస‌కు దారి తీయ‌గా, ఈ అంశంపై మ‌రికొంద‌రు మ‌రింత రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశారు.