Prophet remark row: భార‌త్ స్పందించిన‌ తీరుపై ఇరాన్ సంతృప్తి

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై బీజేపీ నేత‌లు నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో వారిపై బీజేపీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం, ఆ వ్యాఖ్య‌లు వారి వ్య‌క్తిగ‌త‌మ‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌ట్ల ఇరాన్ స్పందించింది.

Prophet remark row: భార‌త్ స్పందించిన‌ తీరుపై ఇరాన్ సంతృప్తి

Iran Foreing Minister With Modi

Prophet remark row: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై బీజేపీ నేత‌లు నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో వారిపై బీజేపీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం, ఆ వ్యాఖ్య‌లు వారి వ్య‌క్తిగ‌త‌మ‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌ట్ల ఇరాన్ స్పందించింది. ఈ వివాదంపై భార‌త వైఖ‌రి ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ ఆమిర్ అబ్దుల్లాహిన్ ప్ర‌స్తుతం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జాతీయ‌ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్‌తో స‌మావేశ‌మ‌య్యారు.

Prophet remarks row: మాట్లాడేముందు పార్టీ నేత‌లు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి: బీజేపీ

ఈ నేప‌థ్యంలో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై బీజేపీ నేత‌లు నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల అంశాన్ని లేవ‌నెత్తారు. దీంతో, భార‌త ప్ర‌భుత్వం, అధికారులకు మహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై గౌర‌వం ఉంద‌ని అజిత్ డోభాల్ అన్నారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వారిపై సంబంధిత విభాగాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయ‌ని చెప్పారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసేవారికి గుణ‌పాఠం చెప్పే విధంగా ఈ చ‌ర్య‌లు ఉంటాయ‌ని అన్నారు. దీంతో అజిత్ డోభాల్‌ ఇచ్చిన స‌మాధానంపై హుస్సేన్ ఆమిర్ అబ్దుల్లాహిన్ సంతృప్తి వ్య‌క్తం చేశారని ఇరాన్ విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Prophet Comments Row: ఢిల్లీ, ముంబైతో సహా పలు చోట్ల దాడులు జరుపుతామంటోన్న ఆల్-ఖైదా

అలాగే, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై, ఇత‌ర మ‌తాల వారి విశ్వాసాల‌పై భార‌త ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం చూపెడుతున్న గౌర‌వం, స‌హ‌నం ప‌ట్ల ఆమిర్ ప్ర‌శంస‌లు కురిపించార‌ని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో యూపీలో హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఈ వివాదంపై ప‌లు ముస్లిం దేశాలు కూడా నిర‌స‌న వ్య‌క్తం చేశాయి.