Prophet remarks row: మాట్లాడేముందు పార్టీ నేత‌లు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి: బీజేపీ

టీవీ షోల్లో పాల్గొనే త‌మ పార్టీ నేత‌ల కోసం బీజేపీ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించింది. వాటిని త‌ప్ప‌కుండా పాటించాల్సిందేన‌ని సూచించింది. ఇటీవ‌ల బీజేపీ నాయ‌కురాలు నురూప్ శ‌ర్మ ఓ టీవీ షోలో పాల్గొని, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగిన విష‌యం తెలిసిందే.

Prophet remarks row: మాట్లాడేముందు పార్టీ నేత‌లు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి: బీజేపీ

Bjp National Meet

Prophet remarks row: టీవీ షోల్లో పాల్గొనే త‌మ పార్టీ నేత‌ల కోసం బీజేపీ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించింది. వాటిని త‌ప్ప‌కుండా పాటించాల్సిందేన‌ని సూచించింది. ఇటీవ‌ల బీజేపీ నాయ‌కురాలు నురూప్ శ‌ర్మ ఓ టీవీ షోలో పాల్గొని, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమెపై ఇప్ప‌టికే బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఈ నేప‌థ్యంలోనే మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించింది.

Kamal haasan : విక్రమ్ భారీ సక్సెస్.. డైరెక్టర్‌కి ఖరీదైన కారు బహుమతి ఇచ్చిన కమల్ హాసన్

బీజేపీ అధికారికంగా ప్ర‌క‌టించిన పార్టీ ప్ర‌తినిధులు, ప్యాన‌లిస్టులు మాత్ర‌మే టీవీ షోల్లో పాల్గొనాల‌ని చెప్పింది. టీవీ షోల్లో పాల్గొనాల్సిన వారి పేర్ల‌ను బీజేపీ మీడియా సెల్ ప్ర‌క‌టిస్తుంద‌ని పేర్కొంది. టీవీ షోల్లో పాల్గొనే బీజేపీ ప్ర‌తినిధులు మ‌త‌ప‌ర చిహ్నాల గురించి మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్పింది. అలాగే, భాషాప‌రంగా జాగ్ర‌త్త‌లు తీసుకుని మాట్లాడాల‌ని పేర్కొంది. మాట్లాడుతోన్న‌ స‌మ‌యంలో భావోద్వేగాల‌కు గురికావ‌ద్ద‌ని, రెచ్చిపోయి మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించింది.

Prophet Comments Row: ఢిల్లీ, ముంబైతో సహా పలు చోట్ల దాడులు జరుపుతామంటోన్న ఆల్-ఖైదా

పార్టీ భావ‌జాలాన్ని, ఆద‌ర్శాల‌ను ఉల్లంఘిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని పేర్కొంది. ప్ర‌త్య‌ర్థులు రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ బీజేపీ ప్ర‌తినిధులు సంయ‌మ‌నం పాటించాల‌ని చెప్పింది. అలాగే, టీవీ షోల‌కు వెళ్లే ముందు ఏ అంశంపై మాట్లాడుతున్నామ‌న్న విష‌యంలో పూర్తిగా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, ఆ విష‌యంపై పార్టీ విధానం ఎలా ఉందో తెలుసుకోవాల‌ని బీజేపీ సూచించింది. కాగా, నురూప్ శ‌ర్మ చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగానూ బీజేపీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో త‌మ పార్టీ నేత‌లు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌కుండా బీజేపీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.