Prophet Comments Row: ఢిల్లీ, ముంబైతో సహా పలు చోట్ల దాడులు జరుపుతామంటోన్న ఆల్-ఖైదా
టెర్రర్ గ్రూప్ ఆల్ ఖైదా లెటర్ విడుదల చేసింది. జూన్ 6న డేట్ వేసి ఉన్న ఉత్తరంలో ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరింపులకు దిగింది.

Al Qaeda
Prophet Comments Row: టెర్రర్ గ్రూప్ ఆల్ ఖైదా లెటర్ విడుదల చేసింది. జూన్ 6న డేట్ వేసి ఉన్న ఉత్తరంలో ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరింపులకు దిగింది.
“మా ప్రవక్తను అవమానించేవారిని హతమార్చాలనుకుంటున్నాం. మా ప్రవక్తను అవమానించే ధైర్యం చేసే వారిని పేల్చివేయడానికి మా శరీరాలు, మా పిల్లల శరీరాలతో పేలుడు పదార్ధాలను సిద్ధం చేశాం. కాషాయ ఉగ్రవాదులు ఇప్పుడు ఢిల్లీ, యూపీ, గుజరాత్, ముంబైలలో వారి అంతం కోసం వేచి ఉండాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగిన నేపథ్యంలో ఇది వెలుగులోకి వచ్చింది.
మహ్మద్ ప్రవక్తపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై కొన్ని ముస్లిం దేశాల నిరసనలతో పాటు వివాదాలు మొదలయ్యాయి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన కామెంట్లపై యాక్షన్ తీసుకుంటూ సస్పెండ్ కూడా చేశారు. ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను బహిష్కరించింది.
Read Also: ప్రవక్తపై కామెంట్ల తర్వాత బీజేపీలో కొత్త రూల్స్
ముస్లిం సమూహాల ప్రదర్శనలు కువైట్, ఖతర్, ఇరాన్ వంటి దేశాల నుంచి వచ్చిన పదునైన రెస్పాన్స్‌ల మధ్య బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని, ఏదైనా మతపరమైన వ్యక్తిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
దాదాపు 10 రోజుల క్రితం టీవీ డిబేట్‌లో శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా.. కొన్ని దేశాల్లో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి.

Al-Qaeda