Kamal haasan : విక్రమ్ భారీ సక్సెస్.. డైరెక్టర్‌కి ఖరీదైన కారు బహుమతి ఇచ్చిన కమల్ హాసన్

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు, కమల్ కి చాలా రోజుల తర్వాత భారీ హిట్ ఇచ్చినందుకు డైరెక్టర్ లోకేష్ కి కమల్ హాసన్ ఖరీదైన కారుని బహుమతిగా..............

Kamal haasan : విక్రమ్ భారీ సక్సెస్.. డైరెక్టర్‌కి ఖరీదైన కారు బహుమతి ఇచ్చిన కమల్ హాసన్

Kamal Haasan

Kamal haasan :  స్టార్ హీరోలు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో సూర్య గెస్ట్ రోల్‌లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా ఉండటంతో, ఎలివేషన్స్ కూడా భారీగా ఉండటంతో ఈ సినిమా హిట్ టాక్ ని సంపాదించుకుంది.

 

చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ ఈ రేంజ్ భారీ విజయం సాధించాడు. ఇప్పటికే విక్రమ్ సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని కలెక్ట్ చేసి 200 కోట్లకు దూసుకెళ్తుంది. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా అభినందనలు కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు, కమల్ కి చాలా రోజుల తర్వాత భారీ హిట్ ఇచ్చినందుకు డైరెక్టర్ లోకేష్ కి కమల్ హాసన్ ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారు.

NBK107: మొదటి వేటను లోడ్ చేస్తున్న బాలయ్య

లెక్సస్ కంపెనీకి చెందిన ఓ ఖరీదైన లగ్జరీ కారును డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌కు కమల్‌ బహుమతిగా ఇచ్చారు. కమల్‌ హాసన్‌ కారు కీని డైరెక్టర్‌కు అందచేశారు. ఆ తర్వాత కమల్ తో కలిసి కారు వద్ద లోకేష్ ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కారు ధర దాదాపు కోటి రూపాయలు ఉంటుందని సమాచారం.