NBK107: మొదటి వేటను లోడ్ చేస్తున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్....

NBK107: మొదటి వేటను లోడ్ చేస్తున్న బాలయ్య

Nbk107 First Hunt Loading

NBK107: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత బాలయ్య తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక గోపీచంద్ మలినేని క్రాక్ తరువాత ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో నందమూరి అభిమానుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!

ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో, ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ ఎప్పుడొస్తుందా అని వారు ఆతృతగా చూస్తున్నారు. కాగా.. తాజాగా ఈ సినిమా నుండి మరో అప్‌డేట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?

బాలయ్య కెరీర్‌లో 107వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ నుండి ‘ఫస్ట్ హంట్ లోడింగ్’ అవుతుందని చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. అయితే ఇది ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించిన అప్‌డేట్ అయ్యి ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ సినిమాకు ‘జై బాలయ్య’.. ‘అన్నగారు’ అనే టైటిళ్లను పరిశీలిస్తోంది చిత్ర యూనిట్. ఈ రెండింటిలో ఏ టైటిల్‌ను చిత్ర యూనిట్ కన్ఫం చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.