KVP Ramachandra Rao: పవన్ కళ్యాణ్ కు కేవీపీ సవాల్.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రూ.10కోట్లు..
వైస్ రాజశేఖర రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై బహిరంగ లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు(KVP Ramachandra Rao).
Congress ex mp kvp ramachandra rao open letter to pawan kalyan
- పవన్ కళ్యాణ్‌కు కేవీపీ బహిరంగ లేఖ
- వైఎస్సార్‌పై అసత్య ఆరోపణలు చేయడం తప్పు
- నిరూపిస్తే పది కోట్ల రూపాయల సవాల్
KVP Ramachandra Rao: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు(KVP Ramachandra Rao) తీవ్రంగా స్పందిస్తూ బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు ఎలాంటి సంబంధం లేదనే నిజాన్ని గుర్తించడంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని కేవీపీ విమర్శించారు. వైఎస్సార్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత ఆయనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని లేఖలో పేర్కొన్నారు.
AP Govt Retirement Age: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు
గతంలో పవన్ కళ్యాణ్‌ను వైఎస్సార్ ఒక పోలీస్ అధికారితో బెదిరించారనడం పచ్చి అబద్ధమని కేవీపీ కొట్టిపారేశారు. పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ పనులు చేయించిన చరిత్ర వైఎస్సార్‌కు లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఆ రోజుల్లో ఒకరిపై ఒకరు వ్యక్తిగత కారణాలతో కేసులు పెట్టుకున్నారని, వాటితో వైఎస్సార్‌కు ఎలాంటి సంబంధం లేదని గుర్తుచేశారు. పవన్ ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన అవసరం గానీ, తీరిక గానీ వైఎస్సార్‌కు ఎప్పుడూ లేదని కేవీపీ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న సదరు పోలీస్ అధికారికి వెంటనే లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఒకవేళ వైఎస్సార్ ఆ అధికారిని పవన్ దగ్గరకు పంపించింది నిజమని తేలితే తాను రూ.10 కోట్లు ఇస్తానని కేవీపీ సవాల్ విసిరారు. పవన్ తన ఆరోపణలను నిరూపించలేకపోతే వైఎస్సార్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
