Madhya Pradesh : ఎన్నికల్లో మహిళలు గెలిస్తే వారింట్లో పురుషులు ప్రమాణ స్వీకారం చేసారు

స్ధానిక సంస్దల ఎన్నికల్లో మహిళలు గెలిస్తే అక్కడ వారి ఇంట్లోని భర్తో, తండ్రో, కొడుకో, ఎవరో ఒక మగవారు అధికారం చెలాయిస్తున్నారనే వార్తలు తరచూ మనం వింటుంటాం.

Madhya Pradesh :  స్ధానిక సంస్దల ఎన్నికల్లో మహిళలు గెలిస్తే అక్కడ వారి ఇంట్లోని భర్తో తండ్రో కొడుకో ఎవరో ఒక మగవారు  అధికారం చెలాయిస్తున్నారనే వార్తలు తరచూ మనం వింటుంటాం. కానీ ఇటీవల మధ్య ప్రదేశ్ లోని ఒక పంచాయతీలలో మహిళలు గెలిస్తే ..వారి భర్తలు లేదా వారి తండ్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

మధ్యప్రదేశ్ లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సాగర్, దమోహ్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో గెలిచిన మహిళల స్ధానంలో వారి కుటుంబంలోని మగవారు ప్రమాణం చేయటం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైలర్ కావటంతో ఈ వ్యవహారం బయటపడింది.

జైసినగర్ గ్రామంలో 10 మంది మహిళలు పంచాయతీ సభ్యులుగా ఎన్నికవ్వగా…ఒక మహిళ స్దానంలో ఆమె తండ్రి ప్రమాణం చేశారు. మరో ఇద్దరు మహిళల భర్తలు, మరో మహిళ బావ ప్రమాణం చేశారు. దామెహ్ జిల్లాలోని గైసాబాద్ పిపారియా కిరౌ గ్రామాల్లోనూ ఇలాంటి   సంఘటనలే వెలుగు చూశాయి.  ఈ వీడియోలు వైరల్ అవటంతో స్ధానిక పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు.

జైసినగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆశారాం సాహూను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే దీనిపై సాహూ స్పందిస్తూ… పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మహిళలను ప్రమాణ స్వీకారానికి రమ్మనమని   ఎన్నిసార్లు పిలిచినా రాకపోగా వారి బంధువులను పంపించారని… దీంతే చేసేదేమి లేక వారితోనే ప్రమాణం చేయించినట్లు వివరించారు.

Also Read : Bihar Hooch Tragedy : బీహార్‌లో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

ట్రెండింగ్ వార్తలు