Mamta Mohandas : ‘యమదొంగ’ హీరోయిన్ బైక్ రైడ్.. వీడియో వైరల్..

అయితే అడపాదడపా తన పిక్స్, అప్‌డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది మమత.. రీసెంట్‌గా బైక్ రైడ్ చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో షేర్ చేసింది.. లగ్జీరియస్ బైక్‌ని స్టైలిష్‌గా నడుపుతూ అదరగొట్టేసింది..

Mamta Mohandas Bike Rides After 15 Years Video Viral

Mamta Mohandas: రాజమౌళి, ఎన్టీఆర్‌ల కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యమదొంగ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ యాక్ట్రెస్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ మంచి నటిగానే కాకుండా సింగర్‌గానూ ఆకట్టుకుంది.. ‘రాఖీ రాఖీ’(రాఖీ), ‘ఆకలేస్తే అన్నంపెడతా’(శంకర్ దాదా జిందాబాద్), ‘36-24-36’(జగడం) వంటి పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. ప్రజీత్ పద్మనాభన్ ను 2011లో పెళ్లాడి 2012లో విడాకులు తీసుకుంది. మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా తెలుగు, తమిళ్ సినిమాల్లో పెద్దగా కనిపించ లేదు..

అయితే అడపాదడపా తన పిక్స్, అప్‌డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది మమత.. రీసెంట్‌గా బైక్ రైడ్ చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో షేర్ చేసింది.. లగ్జీరియస్ బైక్‌ని స్టైలిష్‌గా నడుపుతూ అదరగొట్టేసింది..

ఎవరో రైడ్‌కి తీసుకెళ్తారని వెయిట్ చెయ్యడం ఎందుకు దండగ.. 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్.. కెరీర్ స్టార్టింగ్‌లో సినిమా ప్రయత్నాలు చేసేటప్పుడు మోటార్ సైకిల్ నడిపేదాన్నని పోస్ట్ చేసింది.. మమత నటిస్తున్న ‘లాల్ బాగ్’ అనే మలయాళీ సినిమా అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది..