Medchal Murder
Medchal : రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణ హత్య సంఘటన వెలుగుచూసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను దారుణంగా హత్యచేశాడు ఓ వ్యక్తి.
స్థానికురాలైన రాజమణి వయస్సు 48 ఏళ్లు. ఈమె మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. ఆందోళనతో కుటుంబసభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు వెతుకులాట కొనసాగించారు. కూపీ లాగుతూ… ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారంతో మిస్టరీ తేల్చారు.
రాజమణి ఓ వివాహిత. మేడ్చల్ కు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందని సమాచారం. ఏం జరిగిందో గానీ… సెప్టెంబర్ 8న రాజమణి కనిపించకుండా పోయింది. ఆమె ప్రియుడిని పోలీసులు తమదైన స్టైల్లో విచారించినప్పుడు అసలు విషయం బయటపెట్టాడు. చంపేసినట్టు ఒప్పుకున్నాడు. తాను చేసిన హత్య… దొరక్కుండా తప్పించుకునేందుకు చేసిన నేరాలు చూస్తే.. పోలీసులే షాక్ అయ్యారు. ఆమెను హత్యచేసి… భూమిలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు నిందితుడు.
Rachakonda Murder
మృతదేహాన్ని గొయ్యి నుంచి బయటకు తీయించారు శామీర్ పేట పోలీసులు. పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. రాజమణి హత్య విషయం తెలిసి కుటుంబసభ్యులు బోరున విలపించారు.