Meena : భర్త చనిపోయాక మొదటిసారి.. అలనాటి తారలతో కలిసి మీనా ఇలా..
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త ఇటీవలే నెల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు. అప్పట్నుంచి మీనా తీవ్ర విషాదంలో ఉంది. తాజాగా మీనాను...........
- Saketh U
- Published On : August 10, 2022 / 09:04 AM IST
meena meets old heroins
Meena : ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త ఇటీవలే నెల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు. అప్పట్నుంచి మీనా తీవ్ర విషాదంలో ఉంది. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్ హీరోయిన్స్ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. మీనాని పలకరించి తనతో కలిసి ఫోటోలు దిగారు.
మీనా కూడా అలనాటి తారలు, తన స్నేహితురాళ్ళతో కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్త చనిపోయాక మొదటిసారి తన ఫేస్ లో చిరునవ్వు కనిపించింది. రంభ, సంగీత, సంఘవి, మీనా కలిసి ఫోటో దిగడం, భర్త చనిపోయాక మొదటిసారి ఇలా నవ్వుతూ కనపడటంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మీనా ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
