మెగా బ్రదర్స్.. పిక్ అదుర్స్..
- sekhar
- Published On : January 30, 2021 / 02:53 PM IST
Mega Brothers: శుక్రవారం (జనవరి 29)న మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవీ గారి పుట్టినరోజు.. ఈ సందర్భంగా చిరు సోషల్ మీడియా వేదికగా అంజనా దేవి గారికి ప్రేమ పూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే మెగా బ్రదర్స్ ముగ్గురూ సిస్టర్స్‌తో కలిసి అంజనా దేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. చిరంజీవి, నాగబాబు దంపతులతో పాటు పవన్ కళ్యాణ్ వారి సోదరీమణులు అందరూ కలిసి ఉన్న ఫొటో మెగాభిమానులను నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘డాడీ’ చిత్రంలోని ‘గుమ్మడి గుమ్మడి’ అనే బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ బీజీఎమ్‌తో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంజనా దేవి గారితో కలిసి ఉన్న అపురూప క్షణాలను.. అరుదైన ఫొటోలను వీడియో రూపంలో షేర్ చేశారు చిరు.
జన్మనిచ్చిన అమ్మకి జన్మ దిన శుభాకాంక్షలు! #HappyBirthdayAmma pic.twitter.com/3f9sZg5PXy
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2021
