తేజ్ సినిమాకు మెగా బ్లెస్సింగ్స్..
- sekhar
- Published On : December 23, 2020 / 02:32 PM IST
Megastar Chiranjeevi: మెగా మేనల్లుడికి మెగాస్టార్ బ్లెస్సింగ్స్ అందజేస్తూ ట్వీట్ చేశారు.. సుప్రీం హీరో సాయి తేజ్, నభా నటేష్ జంటగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ‘సోలో బ్రతుకే సో బెటర్’.. ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రిస్మస్ కానుకగా ఈనెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లాక్‌డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ ఇదే కావడం విశేషం. జంటనగరాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా ఈ సినిమాతోనే పున:ప్రారంభమవతున్నాయి. ఈ సందర్భంగా మేనల్లుడికి, మూవీ టీంకి శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి.
ఈ మేరకు ట్వీట్ చేశారాయన. ‘‘ఈ క్రిస్మస్‌కి విడుదలవుతున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ అందరికి నా శుభాకాంక్షలు. లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలో ఒక స్ఫూర్తిని స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అలాగే ప్రేక్షకులందరూ బాధ్యతగా ఫేస్ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ చిరు ట్వీట్ చేశారు.
#StaySafe#SBSBOnDec25th#CelebratingCinema#ReturnOfTeluguCinema #BigScreenEntertainment @IamSaiDharamTej @SVCCofficial pic.twitter.com/NrKwy4u3r0
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2020
