Tokyo Paralympics 2021 : ‘ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచాల్సిందే’.. చిరు అభినందనలు..

టోక్యో పారాలంపిక్స్‌ 2021 లో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ మెగాస్టార్ చిరంజీవి అభినందించారు..

Cjiru

Tokyo Paralympics 2021: 2021 టోక్యో ఒలంపిక్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడల్లో వివిధ విభాగాల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తమ అద్భుతమైన ప్రతిభతో గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ లాంటి మెడల్స్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.

PV Sindhu Success : ఇన్‌క్రెడిబుల్ మైండ్ సెట్, స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్.. పివి సింధు సక్సెస్ స్టోరీ

ఇటీవల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు బ్రోంజ్ మెడల్ గెల్చుకున్న సందర్భంగా భారతీయులంతా ప్రశంసలతో ముంచెత్తారు. మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజాగా టోక్యో పారాలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్ట మొదటి మహిళగా అరుదైన ఘనత దక్కించుకోవడంతో పాటు, దేశానికి గర్వకారణంగానూ.. మరెందరికో స్పూర్తిగానూ నిలిచిన అవని లెఖరా ను మరియు ఈ విభాగంలో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.