Chiranjeevi
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కారవ్యాన్ డ్రైవర్ కిలారి జయరామ్ కరోనా సోకి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనకు భార్య కె.శోభారాణి, ఒక కుమార్తె వినోదిని (8) ఇద్దరు కుమారులు కౌశిక్ (18), జస్వంత్(12) ఉన్నారు. జయరామ్ మృతి ఆ కుటుంబాన్ని తీవ్ర కలతకు గురి చేసింది.
అనంతరం జయరామ్ కుటుంబాన్ని మెగాస్టార్ ఆదుకున్నారు. చిరు అతడి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ పంపించారు. జయరామ్ భార్య శోభ వారి పిల్లలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి వచ్చి చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు చేతులమీదుగా ఈ చెక్‌ని అందుకున్నారు.
ఈ సందర్భంగా జయరామ్ భార్య శోభారాణి మాట్లాడుతూ- ‘‘చిరంజీవి గారు అన్నివేళలా ఆపద్భాందవుడు. ప్రతిసారీ మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. ఇంతకుముందు మా వారు (జయరామ్) బైక్‌పై వెళుతూ యాక్సిడెంట్‌కి గురయ్యారు. వెంటనే ఉపాసన గారికి ఫోన్ చేసి వైద్య సహాయం అందించారు. అప్పుడు మా కుటుంబానికి ఆర్థిక కష్టం లేకుండా ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇది నా పిల్లలకు పెద్ద సాయం. చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు.
కారవ్యాన్ డ్రైవర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం#MegastarChiranjeevi #Megastar #chiranjeevifans@santoshamsuresh pic.twitter.com/BuVJyo1Esc
— satish @10tv news (@SatishKottangi) May 20, 2021