దేవుడికి దయలేదు.. చిరంజీవి సర్జా భార్య, కుమారుడికి కరోనా..

  • Publish Date - December 8, 2020 / 07:27 PM IST

Meghana Raj Sarja – Covid Possitive: కన్నడ నటుడు దివంగత చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ సర్జా, కుమారుడు జూనియర్ చిరంజీవి సర్జా కరోనా బారినపడ్డారు. వీరితోపాటు మేఘనా రాజ్ తల్లిదండ్రులకు కూడా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని మేఘన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.


‘‘హలో.. మా అమ్మ, నాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. గతకొద్ది రోజులుగా మమ్మల్ని కలిసిన వారు కూడా టెస్టులు చేయించుకోండి.. ప్రస్తుతం మేం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాం.. చిరు ఫ్యాన్స్‌ ఎవరూ ఆందోళన చెందవద్దు.. మేం బాగానే ఉన్నాం.. జూనియర్ చిరు ఆరోగ్యంగానే ఉన్నాడు.. అనుక్షణం నేను తన వెన్నంటే ఉన్నా.. ఈ మహమ్మారిపై యుద్ధంలో మా కుటుబం విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’’.. అని పోస్ట్ చేశారామె.

చిన్న వయసులోనే చిరు మరణించాడు.. అప్పటికి మేఘన గర్భవతి.. ఇటీవలే బాబు జన్మించడంతో చిరు మళ్లీ పుట్టాడని సంబరపడ్డాం.. ఇంతలో మేఘన, చిన్న బాబు, ఆమె తల్లిదండ్రులకు మహమ్మారి కరోనా సోకింది.. దేవుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు.. దేవుడికి దయలేదు.. అంటూ చిరు ఫ్యాన్స్, నెటిజన్లు బాధతో కామెంట్స్ చేస్తున్నారు.