Modi prises congress CM in NITI Aayog meeting
NITI Aayog meeting: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి అయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కొంత మంది కేంద్ర మంత్రులు పాల్గొన్నానరు. కాగా, ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌పై ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లో గోధన్ న్యాయ్ యోజన (Godhan Nyay Yojana) పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని మోదీ ప్రస్తావిస్తూ ఉత్తమ కార్యక్రమంగా కొనియాడారు. అలాగే ఆవు పేడ ద్వారా కంపోస్ట్ తయారు చేయడాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రావాలని ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని మోదీ అన్నారు.
2020 జూలై నుంచి అమలవుతున్న ఈ గోధన్ న్యాయ్ యోజన పథకం కింద కిలో రెండు రూపాయల చొప్పున మహిళలు, స్వయం సహాయక సంఘాలు ఆవు పేడను సేకరిస్తారు. గో మూత్రాన్ని సేకరించడం సైతం ఈ మధ్యే ప్రారంభమైంది. గోమూత్రానికి లీటర్ 4 రూపాయల చొప్పున సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన పేడ, మూత్రంతో కంపోస్ట్ తయారు చేస్తున్నారు. గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నేరుగా నగదు పంపుతోంది. ఈ పథకం ద్వారా గోవుల సంరక్షణతో పాటు పంటపొలాలు సారవంతం కావడం రైతన్నలకు మేలు చేస్తోందని ప్రశంసలు అందుతున్నాయి.
Gujarat Elections: హామీల జల్లు కురిపించిన అరవింద్ కేజ్రీవాల్