వెయిట్ లాస్ విస్మయ.. పిక్స్ వైరల్..

Vismaya weightless: స్టార్ హీరో డాటర్ భారీగా బరువు తగ్గింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ హల్ చల్ చేస్తున్నాయి. మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూతురు విస్మయ వెయిట్ లాస్ అయ్యారు.

ఇప్పటి వరకు చాలా లావుగా, బొద్దుగా ఉన్న విస్మయ ఒక్కసారిగా సన్నబడి ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. బరువు తగ్గడం కోసం తీవ్రంగా శ్రమించి ప్రత్యేక వ్యాయామాలు, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని ఏకంగా 22 కిలోలు బరువు తగ్గారు.

తాజాగా వెయిట్ తగ్గకముందు, తగ్గిన తర్వాత ఫోటోలతో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌కు సంబంధించిన వీడియోను విస్మయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్మయ బరువు తగ్గడానికి చాలా బాగా కష్టపడింది.. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి.. అంటూ విస్మయను అభినందిస్తున్నారు.