Cyclone Tauktae: తౌక్టే తుఫాన్ బీభత్సానికి నేలకూలిన 3.5 మిలియన్లకుపైగా చెట్లు.. తేల్చిన ఫారెస్ట్ అధికారులు

భారతదేశంలోని పశ్చిమ తీరంలో 2021 మే నెలలో బీభత్సాన్ని సృష్టించిన తౌక్టే తుఫాను కారణంగా గుజరాత్‌లోని గిర్ జాతీయ ఉద్యానవనంలో 3.5 మిలియన్లకు పైగా చెట్లు నేల కూలినట్లు రాష్ట్ర అటవీశాఖ అనేక సర్వేల ద్వారా నిర్ధారించింది.

Cyclone Tauktae: భారతదేశంలోని పశ్చిమ తీరంలో 2021లో మే నెలలో బీభత్సాన్ని సృష్టించిన తౌక్టే తుఫాను కారణంగా గుజరాత్ లోని గిర్ జాతీయ ఉద్యానవనంలో 3.5 మిలియన్లకు పైగా చెట్లు నేల కూలినట్లు రాష్ట్ర అటవీశాఖ అనేక సర్వేల ద్వారా నిర్ధారించింది. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అటవీ ప్రాంతం ఆసియాలోనే ప్రముఖ అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందింది. తౌక్టే తుఫాను తర్వాత ఏడాదికిపైగా నేలకూలిన చెట్లపై అటవీశాఖ తుది నివేదికను సమర్పించింది. 1982లో సంభవించిన నష్టం ఆధారంగా గత ఏడాది మేలో వాటి సంఖ్య మూడు నుంచి నాలుగు మిలియన్ల మధ్య ఉంటుందని తొలుత అంచనా వేసింది. అంతేకాక శాటిలైట్ డేటా ఆధారంగా గిర్ అటవీ ప్రాంతంలోని 30శాతం చెట్లను తౌక్టే తుఫాను నేలమట్టం చేసినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. చివరి సర్వేతో సహా, సర్వేల వివరాలతో ప్రభుత్వానికి సమర్పించారు.

Rishi Sunak: లిజ్ ట్రస్‌కు షాకిచ్చిన రిషి సునక్.. టీవీ డిబేట్‌లో అనూహ్య విజయం

ఈ విషయంపై అటవీశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తొలుత కనుగొన్న వాటిలో వ్యత్యాసాలను ఉదహరించారు. గత సంవత్సరం వర్షాకాలం తర్వాత తుది సర్వేను నిర్వహించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే వన్య ప్రాణుల సంచారానికి ఆటంకం కలగకుండా కూలిన చెట్లను తొలగించేందుకు కసరత్తు ప్రారంభించినట్లు గిర్ లో ఉన్న జునాగఢ్ లోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆరాధన సాహు తెలిపారు. అయితే  గుజరాత్‌లోని 674 ఆసియాటిక్ సింహాలలో దాదాపు సగం దాదాపు 325 నుండి 350 వరకు గిర్అ భయారణ్యంలో నివసిస్తాయి. ఇంత పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోవటం వల్ల సింహాలపై ప్రతికూల ప్రభావం ఉందని నేను చెప్పలేనని అన్నారు.

Fatwa Girl Driving Tractor : ట్రాక్టర్ నడిపి వ్యవసాయం చేస్తున్న యువతికి ఫత్వా జారీ..జరిమాన కట్టకుంటే ఊరునుంచి బహిష్కిస్తామంటూ హుకుం

గిర్ లోని సింహాల పరిశోధకుడు జల్పన్ రూపపారా మాట్లాడుతూ.. ఆసియా సింహం అత్యధిక వేగాన్ని ప్రదర్శించినప్పుడు మొదటి కొన్ని సెకన్లు వేటకు అత్యంత కీలకమని చెప్పారు. వేరుతో ఉన్న చెట్ల కారణంగా దాని మార్గంలో అడ్డంకి ఏర్పడితే అది తన వేటను కొనసాగించదని, పెరిగిన చెట్లను తొలగిస్తే అది సింహాల కంటే ముఖ్యంగా వేటకోసం ఎక్కువ ఖాళీ స్థలాలను సృష్టినట్లు ఉంటుందని అన్నారు. ఇదిలాఉంటే అటవీ ప్రాంతంలో వృక్షాల సాంద్రత పెరగడం, బహిరంగ ప్రదేశాల సంఖ్య తగ్గడం రక్షిత ప్రాంతాల వెలుపల సింహాల సంఖ్య పెరగడానికి కొన్ని కారణాలని ఆయన తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు