Rishi Sunak: లిజ్ ట్రస్‌కు షాకిచ్చిన రిషి సునక్.. టీవీ డిబేట్‌లో అనూహ్య విజయం

బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనేదిదానిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. లిజ్ ట్రస్ వర్సెస్ భారత సంతతికి చెందిన రిషి సునక్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.

Rishi Sunak: లిజ్ ట్రస్‌కు షాకిచ్చిన రిషి సునక్.. టీవీ డిబేట్‌లో అనూహ్య విజయం

UK PM Election 2022 Liz Truss' victory over Rishi Sunak

Rishi Sunak: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనేదిదానిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. లిజ్ ట్రస్ వర్సెస్ భారత సంతతికి చెందిన రిషి సునక్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ప్రస్తుతం లిజ్ ట్రస్ ముందజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. గురువారం టీవీ డిబేట్ లో లిజ్ ట్రస్ కు రిషి సునక్ షాకిచ్చాడు. అనూహ్య రీతిలో టీవీ డిబేట్ లో రిషి విజయం సాధించాడు. స్కై న్యూస్ నిర్వహించిన ‘బ్యాటిల్ ఫర్ నవంబర్ 10’ టీవీ డిబేట్ లో స్టూడియో ప్రేక్షకులు సునక్ కు మద్దతు తెలిపారు.

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి రేసులో లిజ్‌ ట్రస్‌కు రిషి సునక్ గ‌ట్టిపోటీ!

ఈ డిబేట్‌లో టీవీ ప్రజెంటర్ లిజ్ ట్రస్‌ను తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేసింది. ప్రధానంగా ఇటీవల ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి ట్రస్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించాలని తెలిపింది. కానీ మళ్లీ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నట్లు ట్రస్ ప్రకటించింది. ఇదే విషయంపై ప్రజెంటర్ ట్రస్ ను ప్రశ్నించింది. ట్రస్ మాత్రం తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తెలపడంతో.. ధీటుగా స్పందించిన ప్రజెంటర్..  మంచి నేతలు తమ తప్పులను ఒప్పుకొంటారా? ఇతరులను నిందిస్తారా అంటూ ప్రశ్నించింది. ట్రస్ స్పందిస్తూ.. తన ప్రకటనను కొంత మంది తప్పుదోవ పట్టించారంటూ అసహనం వ్యక్తం చేసింది.

Rishi Sunak: చైనాతో కఠినంగా ఉంటా: బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్

ఇదే డిబేట్ లో సునక్ మాట్లాడుతూ.. పన్నుల తగ్గింపు కంటే ముందు ద్రవ్వోల్బణాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉందని, ద్రవ్వొల్బణం మరింత పెరిగితే మోర్టగేజ్ రేట్లు పెరుగుతాయని, మన సేవింగ్స్ పింఛన్లు అన్నీ ఆవిరవుతాయని అన్నారు. అయితే సునక్ వాదనను ట్రస్ తోసిపుచ్చారు. ఇరివురి మధ్య కొద్దిసేపు వాదోపవాదనలు జరిగాయి. ఆ తరువాత ఆడియన్స్ కు ఓటింగ్ పెట్టారు. ఇందులో ఎక్కువ మంది రుషి సునాక్ కు మద్దతు తెలుపుతూ తమ ఓటు వేశారు. ఓవరాల్ గా ప్రధాని రేసులో లిజ్ ట్రస్ ముందజలో ఉన్నట్లు గురువారం ఓ సర్వే వెల్లడించింది.