Rishi Sunak: చైనాతో కఠినంగా ఉంటా: బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్

చైనాకు తాను అనుకూలం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్ ఖండించారు. తాను ప్రధానిగా ఎన్నికైతే చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. ప్రధానిగా ఎన్నికైన మొదటి రోజునుంచే ఈ పనిచేస్తానన్నారు.

Rishi Sunak: చైనాతో కఠినంగా ఉంటా: బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్

Rishi Sunak

Rishi Sunak: తాను బ్రిటన్ ప్రధాని అయితే, చైనాతో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు బ్రిటన్ ప్రధాన మంత్రి అభ్యర్థి రిషి సునక్. లండన్‌లో ఆదివారం జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చైనా, రష్యాల విషయంలో తాను అనుకూలంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

Covid-19: తగ్గిన కరోనా కేసులు.. పాజిటివిటీ రేటు 7 శాతం

ఈ సందర్భంగా చైనాపై తన వైఖరిని వెల్లడించారు. ‘‘ఆసియాలో సూపర్ పవర్‌గా ఉన్న చైనాతో దేశానికే కాకుండా, అంతర్జాతీయ భద్రతకు కూడా ముప్పు ఉంది. నేను ప్రధానిగా ఎన్నికైతే చైనాతో కఠినంగా వ్యవహరిస్తా. బ్రిటన్‌లో కొనసాగుతున్న చైనాకు చెందిన 30 విద్యా సంస్థల్ని మూసేయిస్తా. ఈ సంస్థల ద్వారా చైనా.. తన భాష, సంస్కృతి ప్రభావం మనపై పడేలా చేస్తోంది. అందుకే మన విద్యా సంస్థల నుంచి చైనా కమ్యూనిస్ట్ పార్టీని తొలగిస్తా. చైనా మన టెక్నాలజీని దొంగిలిస్తూ, మన యూనివర్సిటీల్లోకి చొరబడుతోంది. సైబర్ స్పేస్‌కు సంబంధించి చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు నాటో తరహా వ్యవస్థని ఏర్పాటు చేస్తా.

Wooden Bridge: కుండపోత వానకు కొట్టుకుపోయిన బ్రిడ్జి

చైనా తన సొంత దేశంలోనే ప్రజల్ని హింసిస్తోంది. మానవ హక్కులను ఉల్లంఘిస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థు దెబ్బతీసేందుకు తరచూ తన కరెన్సీ విలువను మార్చుకుంటోంది. మన ఆస్తుల్ని, సంస్థల్ని చైనా కొల్లగొడుతోంది. ఇప్పటివరకు చైనాకు చెందిన వ్యాపార సంస్థలకు బ్రిటన్ నేతలు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. చైనా ఆశయాల్ని నెరవేర్చారు. అయితే, జరిగిందేదో జరిగింది. కానీ, ఇకపై నేను వీటిని మారుస్తా. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి ఈ పని చేస్తా’’ అని రిషి సునక్ వ్యాఖ్యానించారు.

Monkeypox: కామారెడ్డి మంకీపాక్స్ కేసు.. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స

మరోవైపు బ్రిటన్ ప్రధాని ఎన్నిక తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం రిషితోపాటు లిజ్ ట్రస్ ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. కొన్ని అంశాల్లో లిజ్ ముందున్నారు. రిషి.. చైనా, రష్యాలకు అనుకూలంగా ఉంటాడని ప్రచారం జరగడం ఆయన విజయావకాశాల్ని దెబ్బతీస్తోంది. కొన్ని పత్రికలు కూడా ఈ విషయంలో రిషికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. అందుకే తాను చైనాకు వ్యతిరేకం అని చెప్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.