Covid-19: తగ్గిన కరోనా కేసులు.. పాజిటివిటీ రేటు 7 శాతం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడున్నర వేల వరకు తక్కువ కేసులు నమోదయ్యాయి.

Covid-19: తగ్గిన కరోనా కేసులు.. పాజిటివిటీ రేటు 7 శాతం

Covid 19

Covid-19: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,866 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోలిస్తే దాదాపు మూడున్నర వేల వరకు కేసులు తగ్గాయి. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో కేసులు తగ్గడం ఇదే మొదటిసారి. కాగా, కరోనాతో గడిచిన 24 గంటల్లో 41 మంది మరణించగా, 18,148 మంది కోలుకున్నారు.

Monkeypox: కామారెడ్డి మంకీపాక్స్ కేసు.. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స

దేశంలో పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,50,877 కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.34. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,26,074 కాగా, మరణాల శాతం 1.20. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,22,8670. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు దేశవ్యాప్తంగా 2,02,17,66,615 డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 16,82,390 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

Crypto Fraud: క్రిప్టోకరెన్సీ పేరుతో మోసం.. నాలుగు లక్షలు పోగొట్టుకున్న యువకుడు

నిన్న ఒక్క రోజే కరోనాతో కేరళలో 13 మంది, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో 6గురు, పంజాబ్‌లో నలుగురు మరణించారు. మరోవైపు దేశంలో బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అర్హులైన వారికి ప్రభుత్వం ఉచితంగా బూస్టర్ డోసు అందిస్తోంది.