Crypto Fraud: క్రిప్టోకరెన్సీ పేరుతో మోసం.. నాలుగు లక్షలు పోగొట్టుకున్న యువకుడు

క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కనిపించే ఫేక్ వెబ్‌సైట్స్, యాప్స్‌లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఒక యువకుడు ఏకంగా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.

Crypto Fraud: క్రిప్టోకరెన్సీ పేరుతో మోసం.. నాలుగు లక్షలు పోగొట్టుకున్న యువకుడు

Crypto Fraud

Crypto Fraud: క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేటుగాళ్లు క్రిప్టో కరెన్సీ పేరుతో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని బయటపడుతున్నా ఇంకా ప్రజల్లో మార్పు రావడం లేదు. తాజాగా ముంబైకు చెందిన ఒక యువకుడు క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. కుర్లా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువకుడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాడు.

AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆగదు: ఏపీ విలీన గ్రామాల ప్రజలు

ఇందుకోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. అందులో రెండు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ బాగున్నట్లు గుర్తించాడు. వెంటనే వాటిలో తన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ద్వారా రిజిష్టర్ అయ్యాడు. ఆ తర్వాత అతడికి ఆ రెండు కంపెనీలకు చెందిన ప్రతినిధులమంటూ కొన్ని కాల్స్, మెసేజెస్ వచ్చాయి. ఈ సందర్భంగా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ గురించి, తమ సంస్థ గురించి వివరించారు. రెండు కంపెనీలూ పెట్టుబడిపై దాదాపు 5-10 శాతం లాభం ఉంటుందని నమ్మించాయి. దీంతో అతడు ఆ కంపెనీలను నమ్మాడు. తర్వాత ఫిమేల్ ఎగ్జిక్యూటివ్స్ కాల్ చేసి.. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని సూచించారు.

Pitbull Dog: ఓనర్‌ను చంపిన కుక్క.. అయినా దత్తత తీసుకుంటామంటున్న జంతు ప్రేమికులు

ఈ నెల 19-21 మధ్య కాల్స్ చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్, సెక్యూరిటీ డిపాజిట్, అకౌంట్ వెరిఫికేషన్ చార్జెస్, ప్రైవసీ కండిషనల్ ఛార్జెస్, క్రిప్టో అకౌంట్ స్టాంప్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటూ అనేక ఛార్జీల పేరిట, డిపాజిట్ పేరిట దాదాపు నాలుగు లక్షల రూపాయలు తమ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. తర్వాతి రోజు తన అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్‌కు కాల్ చేశాడు. కానీ, కాల్ కనెక్ట్ కాలేదు. తన నెంబర్స్ బ్లాక్ చేసినట్లు గుర్తించాడు. అప్పుడు ఆ యువకుడికి తాను మోసపోయినట్లు అర్థమైంది. వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Wooden Bridge: కుండపోత వానకు కొట్టుకుపోయిన బ్రిడ్జి

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, క్రిప్టో కరెన్సీ సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌లో బోలెడన్ని వెబ్‌సైట్స్, యాప్స్ ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఫేక్ యాప్స్ ఉండే అవకాశం ఉంది. అందువల్ల వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.