AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆగదు: ఏపీ విలీన గ్రామాల ప్రజలు

భద్రాచలం, గోదావరి పరిధిలోని ఏపీకి చెందిన ఐదు విలీన గ్రామాల ప్రజలు తమ పంచాయతీల్ని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఉద్యమం సాగిస్తున్నారు. దీనికి తెలంగాణకు చెందిన అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు.

AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆగదు: ఏపీ విలీన గ్రామాల ప్రజలు

Ap Villages

AP Villages: తమ గ్రామాల్ని తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆగదని, అప్పటివరకు ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు ఏపీలోని ఐదు విలీన గ్రామాల ప్రజలు. కొద్ది రోజులుగా ఏపీలోని ఐదు పంచాయతీలకు చెందిన ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. భద్రాచలం వేదికగా, ఆదివారం తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో ఐదు పంచాయతీలకు చెందిన ప్రజలు ఆందోళన నిర్వహించారు.

Nani : ఆయనకి చిరంజీవి.. మాకు రవితేజ.. ప్రతి జనరేషన్‌కి ఒకడు ఉంటాడు..

తమ గ్రామాల్ని తెలంగాణలో కలిపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయా గ్రామాల ప్రజలు అన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో గత 15 రోజులుగా, సుమారు 40 అడుగుల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. దీంతో గోదావరి వరద ఎప్పుడు తమ ఊళ్లమీద పడుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఐదు గ్రామ పంచాయతీల్లో ఒకటైన యటపాకలో కరకట్ట పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది. మరోవైపు ఈ ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతోంది. అన్ని పార్టీలకు చెందిన నేతలు, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణకు చెందిన అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. తామ గ్రామాల్ని తెలంగాణలో కలపాలని కోరేందుకు కారణం ఏపీ ప్రభుత్వంపై కోపంతో కాదని, ఏదైనా అవసరం వస్తే చాలా దూరంలో ఉన్న పాడేరు వెళ్లాల్సి వస్తోందని అక్కడి ప్రజలు అంటున్నారు.

Nagpur Boy: కాంపిటీషన్ గెలిచాడని రూ.33లక్షల జాబ్ ఇచ్చి.. వయస్సు తక్కువని తెలిసి

తమ గ్రామాలకు అర కిలోమీటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే భద్రాచలం ఉందని, అందువల్ల తమను తెలంగాణలో కలిపితే సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ, ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు కూడా వచ్చి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తమ గ్రామాల్ని తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.