Pitbull Dog: ఓనర్‌ను చంపిన కుక్క.. అయినా దత్తత తీసుకుంటామంటున్న జంతు ప్రేమికులు

మూడేళ్లుగా పెంచుకుంటున్న ఓనర్‌పైనే దాడి చేసి చంపేసిందో కుక్క. అయినప్పటికీ ఆ కుక్కను పెంచుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Pitbull Dog: ఓనర్‌ను చంపిన కుక్క.. అయినా దత్తత తీసుకుంటామంటున్న జంతు ప్రేమికులు

Pitbull Dog

Pitbull Dog: మూడేళ్లుగా పెంచుకుంటున్న ఓనర్‌పైనే దాడి చేసి చంపేసిదో పిట్‌బుల్ జాతికి చెందిన కుక్క. అయినప్పటికీ ఆ కుక్కను దత్తత తీసుకునేందుకు ఇప్పుడు చాలా మంది ముందుకొస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఒక 82 ఏళ్ల వృద్ధ మహిళ మూడేళ్లుగా పిట్‌బుల్ జాతి కుక్కను పెంచుకుంటోంది.

Wooden Bridge: కుండపోత వానకు కొట్టుకుపోయిన బ్రిడ్జి

తన కొడుకుతో కలిసి ఉంటున్న ఆమె బ్రౌనీ అనే ఈ కుక్కతోపాటు, మరో లాబ్రడార్ జాతి కుక్కను కూడా పెంచుకుంటోంది. అయితే, ఇటీవల పిట్‌బుల్ జాతి కుక్క తన ఓనర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం బ్రౌనీ, మున్సిపల్ అధికారుల సంరక్షణలో ఉంది. జంతు సంరక్షణాధికారులు ఈ కుక్కను పర్యవేక్షిస్తున్నారు. తన ప్రవర్తనపై అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంపాటు అధికారుల సమక్షంలోనే ఉండనుంది. అయితే, ఓనర్‌ను చంపినప్పటికీ ఈ కుక్కను దత్తత తీసుకునేందుకు స్థానికులు చాలా మంది ముందుకొస్తున్నారు. ప్రజలతోపాటు, స్వచ్ఛంద సంస్థలు కూడా తాము దత్తత తీసుకుంటామని అధికారుల్ని అడిగాయి.

AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆగదు: ఏపీ విలీన గ్రామాల ప్రజలు

కానీ, దీనిపై అధికారులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓనర్‌ను చంపినందుకు నిబంధనల ప్రకారం కుక్క విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అలాగే బ్రౌనీ ప్రవర్తన ఆధారంగా కూడా నిర్ణయం తీసుకునే వీలుంది. మరోవైపు ఈ కుక్కను ఓనర్ కుటుంబానికే ఇచ్చేయాలి అని బీజేపీ నేత మనేకా గాంధీ సూచించారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.