Rishi Sunak: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి రేసులో లిజ్‌ ట్రస్‌కు రిషి సునక్ గ‌ట్టిపోటీ!

బ్రిటన్ ప్రధాని ప‌ద‌వికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ గట్టిపోటీ ఇస్తున్నార‌ని తాజా స‌ర్వేలో తేలింది. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే. లిజ్‌ ట్రస్ కంటే రిషి సునక్ వెన‌క‌బ‌డ్డార‌ని కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు నిర్వ‌హించిన స‌ర్వేల్లో తేలింది. అయితే, ఇప్పుడు ఆయ‌న అనూహ్యంగా పుంజుకున్నారు.

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి రేసులో లిజ్‌ ట్రస్‌కు రిషి సునక్ గ‌ట్టిపోటీ!

Liz Truss Poised To Become Next PM

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ గట్టిపోటీ ఇస్తున్నార‌ని తాజా స‌ర్వేలో తేలింది. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి రిషి సునక్ పోటీ చేస్తూ తుది రేసులో నిలిచిన విష‌యం తెలిసిందే. లిజ్‌ ట్రస్ కంటే రిషి సునక్ వెన‌క‌బ‌డ్డార‌ని కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు నిర్వ‌హించిన స‌ర్వేల్లో తేలింది. అయితే, ఇప్పుడు ఆయ‌న అనూహ్యంగా పుంజుకున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న‌ లిజ్‌ ట్రస్‌ కంటే ఐదు పాయింట్ల వెనుకంజలో ఉన్నారని తాజా స‌ర్వేలో తేలింది. 807మంది కన్జర్వేటీవ్‌ పార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని టెక్నీ సంస్థ ఈ స‌ర్వే నిర్వ‌హించింది. లిజ్‌ ట్రస్‌కు 48 శాతం మంది మ‌ద్ద‌తు తెల‌ప‌గా, రిషి సున‌క్‌కు 43 శాతం మంది మద్ద‌తుగా నిలిచారు. మిగ‌తావారు త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబించారు. తాజా స‌ర్వేలో.. రిషి సున‌క్, లిజ్ ట్ర‌స్‌ మధ్య ఐదు శాతం మాత్రమే తేడా ఉన్న‌ట్లు తేల‌డంతో పోటీ బాగానే ఉండ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఓట‌ర్ల‌ నుంచి కొన్ని మీడియా సంస్థ‌లు కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నాయి. ఈ పోటీలో లిజ్‌ ట్రస్ గెలుస్తార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని, అయితే, విజేత ఎవ‌రో ఇప్పుడు స్ప‌ష్టం చేయ‌లేమ‌ని కామెరాన్ కిచ్ అనే 19 ఏళ్ళ ఓట‌రు అన్నారు. తాను రిషి సున‌క్‌కు ఓటు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని పీట‌ర్ బ్యార్రోవ్‌క్లిఫ్ అనే మ‌రో ఓట‌రు చెప్పారు.

China: అమెరికా, తైవాన్‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న చైనా.. కీల‌క చ‌ర్య‌లు