China: అమెరికా, తైవాన్‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న చైనా.. కీల‌క చ‌ర్య‌లు

తైవాన్ నుంచి పండ్లు, చేప‌లతో పాటు ప‌లు వ‌స్తువుల‌ ఉత్ప‌త్తుల దిగుమ‌తుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ నిర్ణ‌యం నేటి నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. అలాగే, నేటి నుంచి చైనా నుంచి తైవాన్‌కు స‌హ‌జ ఇసుక ఎగుమ‌తుల‌ను కూడా నిలిపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. శాంతి, స్థిరత్వానికి అమెరికా చర్యలు విఘాతం కలిగిస్తాయని, చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్య‌వ‌హ‌రించార‌ని చైనా దిన‌ప‌త్రిక‌లు పేర్కొన్నాయి.

China: అమెరికా, తైవాన్‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న చైనా.. కీల‌క చ‌ర్య‌లు

China-Taiwan conflict

China: చైనా హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌రు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టించారు. గత ఏళ్ళ‌లో ఎన్న‌డూ లేని విధంగా అమెరికాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారి తైవాన్‌లో పర్యటించడం ఇదే మొద‌టిసారి. దీంతో చైనా తీవ్ర అసహనానికి గురైంది. దీంతో ఇవాళ‌ ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేసింది. తైవాన్ నుంచి పండ్లు, చేప‌లతో పాటు ప‌లు వ‌స్తువుల‌ ఉత్ప‌త్తుల దిగుమ‌తుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ నిర్ణ‌యం నేటి నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. అలాగే, నేటి నుంచి చైనా నుంచి తైవాన్‌కు స‌హ‌జ ఇసుక ఎగుమ‌తుల‌ను కూడా నిలిపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

కాగా, చైనా హెచ్చరికల న‌డుమ తైవాన్‌లో ప‌ర్య‌టించిన నాన్సీ పెలోసి.. తైవాన్ ప్ర‌భుత్వం దేశాన్ని న‌డిపిస్తోన్న తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. భ‌ద్ర‌త‌, ఆర్థిక వ్య‌వ‌స్థ విష‌యాల్లో తైవాన్ స‌మ‌ర్థంగా ప‌నిచేస్తోంద‌ని ఆమె అన్నారు. క‌రోనాను ఎదుర్కొన్న తీరును కొనియాడారు. అలాగే, తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చే విషయంలో త‌మ దేశం నిబద్ధతను చాటుతోందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధితో పాటు ఉమ్మడి ప్రయోజనాలకు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆమె తెలిపారు.

మ‌రోవైపు, చైనా అధికారిక మీడియాలో అమెరికా, తైవాన్‌పై ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. శాంతి, స్థిరత్వానికి అమెరికా చర్యలు విఘాతం కలిగిస్తాయని, చైనా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్య‌వ‌హ‌రించార‌ని అక్క‌డి దిన‌ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. కాగా, 21 చైనా మిలిటరీ విమానాలు తమ గ‌గ‌న‌త‌లంలోకి ప్రవేశించాయని తైవాన్ తెలిపింది. త‌మ సైన్య అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని చెప్పింది. నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని మొద‌టి నుంచి చైనా హెచ్చ‌రిస్తుండ‌డంతో ఏ నిమిషం ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేప‌ట్టిన తైవాన్