China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేప‌ట్టిన తైవాన్

తైవాన్ సైన్యం దేశ వ్యాప్తంగా సైరన్లు మోగించింది.. స‌రిహ‌ద్దులోని వీధులను ఖాళీ చేయిస్తోంది.. చాలా మంది ప్రజలను శిబిరాలకు తరలిస్తోంది. చైనాలో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగిన నేప‌థ్యంలో భారీగా సైనిక విన్యాసాలు చేప‌ట్టింది. తైవాన్‌లో అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇవాళ‌ ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంది. అయితే, నాన్సీ పెలోసీ తైవాన్‌కు వ‌స్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక‌ త‌ప్ప‌ద‌ని చైనా ఇప్ప‌టికే హెచ్చ‌రించింది. దీంతో తైవాన్ అప్ర‌మ‌త్త‌మై, భారీ యుద్ధ విన్యాసాలను చేపట్టింది.

China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేప‌ట్టిన తైవాన్

China-Taiwan conflict

China: తైవాన్ సైన్యం దేశ వ్యాప్తంగా సైరన్లు మోగించింది.. స‌రిహ‌ద్దులోని వీధులను ఖాళీ చేయిస్తోంది.. చాలా మంది ప్రజలను శిబిరాలకు తరలిస్తోంది. చైనాలో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగిన నేప‌థ్యంలో భారీగా సైనిక విన్యాసాలు చేప‌ట్టింది. తైవాన్‌లో అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇవాళ‌ ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంది. అయితే, నాన్సీ పెలోసీ తైవాన్‌కు వ‌స్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక‌ త‌ప్ప‌ద‌ని చైనా ఇప్ప‌టికే హెచ్చ‌రించింది. దీంతో తైవాన్ అప్ర‌మ‌త్త‌మై, భారీ యుద్ధ విన్యాసాలను చేపట్టింది. తైవాన్ త‌మ భూభాగ‌మేన‌ని చైనా వాదిస్తోన్న విష‌యం విదిత‌మే.

ఈ నేప‌థ్యంలో నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో చైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. అయితే, ఫెలోసీ బృందం సింగ‌పూర్‌, మ‌లేషియా, ద‌క్షిణ కొరియా, జ‌పాన్‌లో మాత్ర‌మే ప‌ర్య‌టిస్తుంద‌ని ఆమె కార్యాల‌యం తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయిన‌ప్ప‌టికీ ఆమె తైవాన్‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇటీవ‌లే ప‌లుసార్లు తైవాన్ గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లోకి యుద్ధ విమానాలను పంపింది చైనా. తైవాన్‌కు అమెరికా మిలటరీ పరంగా మ‌రోసారి సాయం ప్ర‌క‌టించింది.

దీంతో, ఇవాళ‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. నాన్సీ పెలోసీ తైవాన్‌లో ప‌ర్య‌టిస్తే త‌మ‌ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌ని చైనా పేర్కొంది. అంతేగాక, చైనా-అమెరికా సంబంధాల‌పై కూడా తీవ్ర ప్ర‌తికూల‌ ప్ర‌భావం ప‌డుతుంద‌ని తెలిపింది. ఒక‌వేళ‌ చైనా దాడి చేస్తే ప్ర‌తి దాడి చేయాల‌ని తైవాన్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంది. ద‌క్షిణ చైనా స‌ముద్రంలోనూ చైనా ఆధిప‌త్యాన్ని కొన‌సాగ‌నివ్వ‌ద్ద‌ని అమెరికా భావిస్తోంది. తైవాన్‌కు 862 కోట్ల రూపాయ‌ల విలువైన‌ మిలట‌రీ-సాంకేతిక సాయాన్ని అందించడానికి అమెరికా ఇటీవ‌లే నిర్ణ‌యించింది.

viral video: ఉద్యోగం నుంచి తొల‌గించార‌న్న కోపంతో ల‌గ్జ‌రీ ఇళ్ళ‌ను కూల్చేసిన‌ వ్య‌క్తి