viral video: ఉద్యోగం నుంచి తొల‌గించార‌న్న కోపంతో ల‌గ్జ‌రీ ఇళ్ళ‌ను కూల్చేసిన‌ వ్య‌క్తి

ఉద్యోగం నుంచి తొల‌గించార‌న్న కోపంతో ల‌గ్జ‌రీ ఇళ్ళ‌ను ఎక్స్‌కవేటర్‌తో కూల్చేశాడు ఓ వ్య‌క్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను స్థానిక వ్యక్తి ఒక‌రు స్మార్ట్‌ఫోన్‌లో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. కెన‌డాలోని కైల్‌గెరీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

viral video: ఉద్యోగం నుంచి తొల‌గించార‌న్న కోపంతో ల‌గ్జ‌రీ ఇళ్ళ‌ను కూల్చేసిన‌ వ్య‌క్తి
ad

Viral video: ఉద్యోగం నుంచి తొల‌గించార‌న్న కోపంతో ల‌గ్జ‌రీ ఇళ్ళ‌ను ఎక్స్‌కవేటర్‌తో కూల్చేశాడు ఓ వ్య‌క్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను స్థానిక వ్యక్తి ఒక‌రు స్మార్ట్‌ఫోన్‌లో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది. కెన‌డాలోని కైల్‌గెరీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కైల్‌గెరీలో ప‌నిచేసే ఓ వ్య‌క్తిని అత‌డి బాస్ ప‌లు కార‌ణాల వ‌ల్ల‌ ఇటీవ‌లే ఉద్యోగం నుంచి తొల‌గించాడు. దీంతో ఆ ఉద్యోగి ఆగ్ర‌హంతో ర‌గిలిపోయాడు. ఆ కోపంలో ఏం చేస్తున్నాడో అత‌డికే తెలియ‌లేదు.

rainfall: రెండు నెల‌లు సాధార‌ణ వ‌ర్ష‌పాతం: ఐఎండీ

ఎక్స్‌కవేటర్‌ను తీసుకొచ్చి ఓ స‌రస్సు ప‌క్క‌న ఉండే ల‌గ్జ‌రీ ఇళ్ళ‌ను కూల్చ‌డం ప్రారంభించాడు. ఈ విష‌యంపై స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించారు. పోలీసులు వ‌చ్చేలోపే ఆ ఇళ్ళ‌ను కూల్చేశాడు ఆ వ్య‌క్తి. అనంత‌రం అత‌డిని అరెస్టు చేసిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. కోపంతో ల‌గ్జ‌రీ ఇళ్ళ‌ను ఎక్స్‌కవేటర్‌తో కూల్చేశాడు ఓ వ్య‌క్తికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజ‌న్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.