×
Ad

మిమ్మల్ని 10 అడగుల గోతిలో పాతి పెడతా..ఆచూకీ కూడా తెలీకుండా చేస్తా : CM వార్నింగ్

  • Published On : December 26, 2020 / 03:00 PM IST

Mp : Will bury you 10 feet in the ground CM warns mafia : ‘‘నేను ఈమధ్య చాలా ప్రమాదకర మూడ్‌లో ఉన్నాను..అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టేది లేదు..మధ్యప్రదేశ్‌ను వదిలి వెళ్లిపోండి..లేదంటే మిమ్మల్ని 10 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతాను జాగ్రత్త’’ అంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ల్యాండ్ మాఫియాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

‘‘నేను తలచుకుంటే మీరు ఏమైపోయారన్నదీ ఎవరికీ తెలియకుండా చేస్తా‘‘నంటూ హౌషంగాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అక్రమార్కులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.

హౌషంగాబాద్ లో శుక్రవారం (డిసెంబర్ 25,2020) ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ..‘నేను ఈ మధ్య కొన్ని రోజులుగా చాలా ప్రమాదకర మూడ్‌లో ఉన్నాను. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదలను అటువంటివారు వెంటనే మధ్యప్రదేశ్‌ను వదిలి వెళ్లిపోండి. లేదంటే మిమ్మల్ని భూమిలో 10 అడుగుల లోతులో పాతిపెడతాను. మీరు ఏమైపోయారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు’ అంటూ ల్యాండ్ మాఫియాకు చౌహాన్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు.

తమ ప్రభుత్వం మెరుగైన పాలనను అందిస్తోందని..ప్రభుత్వ పథకాలను ప్రజలు సరైన సమయంలో, ఎటువంటి లంచాలు ఇవ్వకుండా పొందగలుగుతున్నారని అన్నారు. కాగా..ఖజ్రానా, కబుతార్ ఖానా ప్రాంతాల్లో ఇటీవల ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ దురాక్రమణలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేసింది. ఈ సందర్భంగా వారిని ఉద్ధేశించి సీఎం ఇటువంటి ఘాటు హెచ్చరికలు చేశారు.