Nandamuri BalaKrishna : ‘నన్నింతటి వాణ్ణి చేసింది మీ అభిమానం.. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను’ – బాలయ్య..

జూన్ 10న నటసింహా నందమూరి బాలకృష్ణ 61వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు..

Nandamuri BalaKrishna: జూన్ 10న నటసింహా నందమూరి బాలకృష్ణ 61వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. బాలయ్య జన్మదినం అంటే అభిమానులకు పర్వదినం.. ఆ రోజు వారు పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. కొందరు బాలయ్యను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి వివిధ ప్రాంతాలనుండి హైదరాబాద్ వస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బర్త్‌డే రోజు తనను కలవడానికి అభిమానులెవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు బాలయ్య. ఈ మేరకు తన ఫేసుబుక్ ద్వారా ఓ పోస్ట్ చేశారాయన..

‘‘నా ప్రాణ సమానులైన అభిమానులకు ..
ప్రతి ఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజు నాడు ..
నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి
సర్వదా విధేయుడ్ని..
కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు ..
నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం..
ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను..

మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు..
మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు..
మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక ..
దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ..
ఈ విపత్కాలంలో అసువులు బాసిన
నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..
మీ నందమూరి బాలకృష్ణ’’ ..

ట్రెండింగ్ వార్తలు