తప్పులో కాలేసిన గూగుల్.. కె.జి.యఫ్ 2 లో ‘‘బాలయ్య’’

Nandamuri Balakrishna: సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్’ మూవీకి సీక్వెల్‌గా ‘కె.జి.యఫ్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలింని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ తదితరలతో పాటు నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏంటి నిజమేనా అని డౌట్ వస్తుందా.. నిజమే మరి ఎందుకంటే ‘కె.జి.యఫ్ 2’ లో బాలయ్యని నటింపచేస్తోంది గూగుల్..

నిజమేనండీ.. గూగుల్‌లో ‘కె.జి.యఫ్’ కాస్ట్ అని సెర్చ్ చేస్తే సినిమాలో నటిస్తున్న నటీనటులతో పాటు బాలయ్య కూడా కనిపిస్తున్నాడు. పైగా ఈ మూవీలో ఇనాయత్ ఖలీల్ క్యారెక్టర్ చేస్తున్నట్టు కూడా చూపిస్తోంది. దీంతో ఈ వార్త వైరల్ అవడంతో పాటు గూగుల్ తప్పులో కాలేసినట్టు కన్ఫామ్ అయిపోయిందన్నమాట.

‘కె.జి.యఫ్ 2’ తెలుగులో వారాహి చలనచిత్రం, తమిళ్‌లో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హిందీలో ఎక్స్‌ఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ & ఎఎ ఫిల్మ్స్, మలయాళంలో గ్లోబల్ యునైటెడ్ మీడియా ద్వారా విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీతం : రవి బస్రూర్, కెమెరా : భువన్ గౌడ, ఎడిటింగ్ : శ్రీకాంత్, నిర్మాణం : హోంబలే ఫిల్మ్స్.

 

ట్రెండింగ్ వార్తలు