‘శ్యామ్ సింగ రాయ్’ స్టార్ట్ అయ్యాడు..

  • Publish Date - December 10, 2020 / 01:23 PM IST

Nani’s Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా.. ‘టాక్సీవాలా’ తో ఆకట్టుకున్న రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.


హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని తండ్రి ఘంటా రాంబాబు క్లాప్ నివ్వగా, మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. శివ నిర్వాణ, వెంకీ కుడుముల కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ అందచేశారు.