Nandamuri Balakrishna : ట్రెండింగ్‌లో బాలయ్య బర్త్‌డే సీడీపీ..

బాలయ్య సంతకంతో ఉన్న సీడీపీ ఇండియా వైడ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది..

Nata Simha Nandamuri Balakrishna Birthday Cdp Trending India Wide

Nandamuri Balakrishna: బాక్సాఫీస్ బొనాంజా.. గాడ్ ఆఫ్ మాసెస్‌గా పిలవబడే నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10).. సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్‌డే సీడీపీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

బాలయ్య సంతకంతో ఉన్న సీడీపీ ఇండియా వైడ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. అలాగే బాలకృష్ణ, బోయపాటిల కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ నుండి రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ కూడా ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.

పలువురు సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసిన బాలయ్య బర్త్‌డే సీడీపీ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. #AkhandaBirthdayRoar #HappyBirthdayNBK, #NandamuriBalakrishna అనే హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్‌లో ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్నాయి.