Naveen Polishetty : యాసిడ్ నా ఫేవరెట్ క్యారెక్టర్ అని చెప్పారు.. ప్రభాస్ ఫుడ్‌తో చంపేస్తారు.. ‘మాయాబజార్’ సినిమాలోలా ఫుడ్ వస్తూనే ఉంది..

‘జాతిరత్నాలు’ ఇప్పుడు ఎవరినోట విన్నా ఇదే పేరు.. ఏ థియేటర్ దగ్గర చూసినా హౌస్ ఫుల్ బోర్డ్.. ఎవరిని కదిలించినా ‘జాతిరత్నాలు’ సినిమా చూశావా.. ‘జాతిరత్నాలు’ సినిమాకి టికెట్స్ కావాలి.. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ అండ్ కళ్లు చెదిరే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది ‘జాతిరత్నాలు’ సినిమా..

Naveen Polishetty: ‘జాతిరత్నాలు’ ఇప్పుడు ఎవరినోట విన్నా ఇదే పేరు.. ఏ థియేటర్ దగ్గర చూసినా హౌస్ ఫుల్ బోర్డ్.. ఎవరిని కదిలించినా ‘జాతిరత్నాలు’ సినిమా చూశావా.. ‘జాతిరత్నాలు’ సినిమాకి టికెట్స్ కావాలి.. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ అండ్ కళ్లు చెదిరే కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది ‘జాతిరత్నాలు’ సినిమా..


తమ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక‌ృష్ణ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘జాతిరత్నాలు’.. ఫరియా అబ్దుల్లా కథానాయిక.. అనుదీప్ దర్శకత్వంలో స్వప్న సినిమాతో కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ నిర్మించారు.

 

రియల్ సక్సెస్ అంటే ఇదే: ‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నవీన్ ఏ రేంజ్‌లో సందడి చేశాడో చూశాం. అతను మాట్లాడే విధానానికి డార్లింగ్ ఫిదా అయ్యారు. విశేషం ఏంటంటే.. ‘బాహుబలి’ రిలీజ్ టైంలో నవీన్ యాంకర్‌గా ప్రభాస్ అండ్ టీంని ఇంటర్వూ చేశాడు. కట్ చేస్తే ఆ ‘బాహుబలి’, పాన్ ఇండియా స్టార్ నవీన్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ఛానెల్స్‌కి ఇంటర్వూ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి.. ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.. ట్రైలర్ లాంచ్ అప్పుడు నేను వెళ్లగానే ప్రభాస్.. ‘‘చిచ్చోరే’ లో అదరగొట్టావ్ కదా’’.. అన్నారు.. ‘మీరు చూశారా అని షాక్‌లో’ అడిగా.. ‘‘చూడ్డం ఏంటి.. యాసిడ్ (నవీన్ చేసిన రోల్) నా ఫేవరెట్ క్యారెక్టర్, అవుట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావ్’’ అని చెప్పారు.

ఇక ప్రభాస్ మాంచి ఫుడ్ లవర్ అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.. ఆయన ఫుడ్ గురించి చాలామంది చెప్పారు కానీ రాజమౌళి అయితే మాత్రం మెనూతో పాటు వివరంగా చెప్పారు. ‘సాహో’, ‘రాధే శ్యామ్’ షూటింగ్ టైంలో యూనిట్ మొత్తానికి ప్రభాస్ ఫుడ్ టేస్ట్ చూపించిన సంగతి తెలిసందే.. రీసెంట్‌గా ‘జాతిరత్నాలు’ టీంకి ప్రభాస్ లంచ్ ట్రీట్ ఇచ్చారని.. ‘మాయాబజార్’ సినిమాలో ఒచ్చినట్టు ఫుడ్ వస్తూనే ఉంది.. అని నవీన్ చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు