New Bihar law minister Kartikeya Singh faces arrest in kidnapping case
Kartikeya Singh: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలకు కూడా గడవకముందే ఒక మంత్రిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అది కూడా న్యాయశాఖా మంత్రి మీదే జారీ కావడం విశేషం. బిహార్ న్యాయ శాఖ మంత్రి కార్తికేయ సింగ్కు ఎదురైన చేదు అనుభవం ఇది. మంగళవారమే బిహార్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి చెందిన కార్తికేయ న్యాయ శాఖ మంత్రిగా నితీశ్ కేబినెట్లో చేరారు.
కాగా, 2014లోని కిడ్నాప్ కేసులో మంత్రి కార్తికేయపై బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో మొత్తం 16కి భాగస్వామ్యం ఉన్నట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. ఇందులో మంత్రి కార్తికేయ, ఎమ్మెల్యే అనంత్ సింగ్ పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. వాస్తవానికి ఈ కేసులో ఆగస్టు 16నే దనపూర్ కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. అదే రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం ఉండడం వల్ల ఆయన హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.
ఈ విషయమై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘నితీశ్ కుమార్ కేబినెట్ ఫొటో చూస్తే భయంకరంగా కనిపించింది. నేరాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు, న్యాయ స్థానాల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు కేబినెట్లో ఉన్నారు. వీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? చట్టాన్ని ఎలా రక్షిస్తారు?’’ అని బిహార్ బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ అన్నారు. కాగా, ఈ కేసు విషయమై తనకేమీ తెలియదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం.
HC on coronil: ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు: కోరోనిల్పై రాందేవ్కు హైకోర్టు వార్నింగ్