నిహారిక పెళ్లి.. పవర్‌స్టార్ రాకతో జోష్ డబుల్ అయ్యింది..

  • Publish Date - December 9, 2020 / 12:02 PM IST

Niharika Konidela Marriage: కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సందడి చేశారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాకతో ఆ సందడి రెట్టింపు అయ్యింది. మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్స్‌కు చైతన్య, నిహారికతో పాటు అందరూ కాలు కదిపారు. సోమవారం సంగీత్, మంగళవారం హల్దీ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు.


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్ విలాస్‌లో డిసెంబర్9, బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు మిథున లగ్నంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య, కొణిదెల నిహారిక ఒకటి కానున్నారు.డిసెంబర్ 11, శుక్రవారం నాడు హైదరాబాద్, జెఆర్సీ కన్వెన్షన్‌లో సినీ ప్రముఖులు కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.


కాగా ఇంతకాలం అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ గారాలపట్టి నిహారిక మరో ఇంటికి కోడలిగా వెళ్తున్న సందర్భంగా నాగబాబు, చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో భావోద్వేగభరితమైన ట్వీట్స్ చేశారు.వివాహ కానుకగా పెదనానన్న చిరు, నిహారికకు దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే ప్రత్యేకమైన ఆభరణాలు బహుమతిగా ఇచ్చారని సమాచారం.