Nitish is the main actor: 10 ఏళ్ల ఈ డ్రామాకు నితీష్ ప్రధాన నటుడు: పీకే విమర్శలు

బిహార్‭లో ఈ రాజకీయ అస్థిరత యుగం పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఇది ఇంకా అదే దశలో పోతూనే ఉంది. 2012-13 లో ఈ అస్థిరత ప్రారంభమైంది. ఈ నాటకంలో నితీష్ ప్రధాన నటుడు. ఆయన నిలకడలేనితనం వల్ల బిహార్‭కు ఈ పరిస్థితి వచ్చింది. నితీష్ ఇప్పుడు నిర్మించుకున్న వేదికపై అయినా నిలబడతారా అనేదే ఒక బిహార్ పౌరుడిగా ఆశించగలం. బిహార్‭లో కొన్నేళ్లుగా రెండు విషయాల్లో మార్పు రాలేదు. ఒకటి ముఖ్యమంత్రిగా నితీష్ మాత్రమే ఉన్నారు. ఇంకొకటి బిహార్ ప్రజల అభివృద్ధి అక్కడే ఆగిపోయింది.

Nitish is the main actor: బిహార్‭లో కొనసాగుతున్న రాజకీయ మార్పులపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోందని, ఇది ఇంకా ఇంకా ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. అయితే ఈ అస్థితరకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి నితీష్ కుమారేనని పీకే విమర్శించారు. బిహార్‭లో ఎన్డీయే నుంచి విడిపోయిన నితీష్ కుమార్.. మళ్లీ ఒక్క రోజులోనే ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వం నిలబడటం లేదు. దీనిపై పీకే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

‘‘బిహార్‭లో ఈ రాజకీయ అస్థిరత యుగం పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఇంకా అదే దశలో పోతూనే ఉంది. 2012-13 లో ఈ అస్థిరత ప్రారంభమైంది. ఈ నాటకంలో నితీష్ ప్రధాన నటుడు. ఆయన నిలకడలేనితనం వల్ల బిహార్‭కు ఈ పరిస్థితి వచ్చింది. నితీష్ ఇప్పుడు నిర్మించుకున్న వేదికపై అయినా నిలబడతారా అనేదే ఒక బిహార్ పౌరుడిగా ఇంతకు మించి ఇంకేమీ ఆశించలేకపోతున్న. బిహార్‭లో కొన్నేళ్లుగా రెండు విషయాల్లో మార్పు రాలేదు. ఒకటి ముఖ్యమంత్రిగా నితీష్ మాత్రమే ఉన్నారు. ఇంకొకటి బిహార్ ప్రజల అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. గత ప్రభుత్వం నుంచి సుపరిపాలన ఆశించిన ప్రజలకు ఏమీ దక్కలేదు. ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడాలి’’ అని పీకే అన్నారు.

నితీష్ నేతృత్వంలోని జనతా దళ్ యునైటెడ్‭ పార్టీలో కొంత కాలం జాతీయ ఉపాధ్యక్షుడిగా చేసిన పీకే.. బీజేపీతో సీట్ల పంపకాల విషయంలో నితీష్‭తో మాటా మాటా పెరిగి బయటికి వచ్చారు. అనంతరం బిహార్ యువతను చైతన్యం చేసే కార్యక్రమాలు చేస్తా అంటూ ఆ మధ్య ప్రకటించినప్పటికీ.. ఆ విషయమై ఇప్పటికీ ఆయన నుంచి కానీ ఆయన టీం నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే గత రెండు నెలలుగా ఆయన బిహార్‭లోనే ఉంటూ ప్రణాళికలు రచిస్తున్నారని, గ్రౌండ్ తెలుసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ సహా దేశంలో పలు చోట్ల రాజకీయ వ్యూహకర్తగా పీకే బిజీ బిజీగా ఉన్నారు.

Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్‌జేడీకి జాక్‌పాట్!

ట్రెండింగ్ వార్తలు