Nitish kumar: బీజేపీని 4 మంత్రి పదవులు అడిగితే ఇవ్వలేదు

ఆర్జేడీతో జతకట్టి ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్, సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షమైన బీజేపీపై తన ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ఎన్డీయేను వీడుతున్నట్లు ప్రకటించిన అనంతరమే తనను రాష్ట్రంలో నిలువరించేందుకు చిరాగ్ పాశ్వాన్‭ను ఉపయోగించుకున్నారని (ఆయన పాశ్వాన్ పేరు ఎత్తుకుండా ఈ విషయాన్ని చెప్పారు) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర కేబినెట్‭లో జేడీయూకి ప్రాధాన్యత లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

Nitish kumar: బీజేపీతో తెగతెంపులకు గల కారణాలను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మెల్లిగా వెల్లడిస్తున్నారు. మోదీ 2.0 ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం కేంద్ర కేబినెట్‭లో నాలుగు మంత్రి పదవులు అడిగితే ఇవ్వలేదని, అందుకే తాను కేంద్ర కేబినెట్‭లో చేరలేదని ఆయన వెల్లడించారు. పార్టీల మధ్య పదవుల అవగాహన సరిగా కుదరకపోతే పొత్తు విచ్ఛిన్నం అవుతుంది. ఎన్డీయే నుంచి నితీశ్ కుమార్ బయటికి వేరే కారణాలేవో బయటికి చెప్పినప్పటికీ బీజేపీతో ఆయనకు చెడింది ఇలాంటి కారణలతోనేనని వేరే చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో జేడీయూ ప్రాధాన్యం తగ్గేలా వ్యవహరిస్తున్న బీజేపీ, కేంద్రంలో అసలు నితీశ్‭కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆయన ఎన్డీయేను విడిచి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే.. ఆర్జేడీతో జతకట్టి ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్, సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షమైన బీజేపీపై తన ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ఎన్డీయేను వీడుతున్నట్లు ప్రకటించిన అనంతరమే తనను రాష్ట్రంలో నిలువరించేందుకు చిరాగ్ పాశ్వాన్‭ను ఉపయోగించుకున్నారని (ఆయన పాశ్వాన్ పేరు ఎత్తుకుండా ఈ విషయాన్ని చెప్పారు) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర కేబినెట్‭లో జేడీయూకి ప్రాధాన్యత లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

‘‘మాకు (జేడీయూ) 16 మంది ఎంపీలు ఉన్నారు. అందులో నలుగరికి కేంద్ర కేబినెట్‭లో పదవులు కావాలని అడిగాము. అందుకు బీజేపీ ఒప్పుకోలేదు. ఒక్క కేంద్ర మంత్రి కూడా మా పార్టీ నుంచి లేరు. కానీ రాష్ట్రం నుంచి ఐదుగురు బీజేపీ నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. అందుకే కేంద్ర కేబినెట్‭లో చేరకూడదని నిర్ణయించుకున్నాము. ఏం జరిగిందో తెలియదు, ఆర్‭సీపీ సింగ్‭ను నాకు చెప్పకుండానే కేబినెట్‭లోకి తీసుకున్నారు. అందుకే ఆయన చేత రాజీనామా చేయించాను’’ అని నితీశ్ కుమార్ అన్నారు.

Priyank Kharge: లంచం లేదంటే మంచం.. కాంగ్రెస్ నేత ఖర్గే కుమారుడి వివాదాస్పద వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు